BigTV English

Encointers : మావోలకు మరో భారీ ఎదురుదెబ్బ – 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృత్యువాత

Encointers : మావోలకు మరో భారీ ఎదురుదెబ్బ – 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు మృత్యువాత

Encointers : కేంద్ర ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో మావోయిస్టులకు మంచి పట్టున్న ఛత్తీష్ గఢ్ అడవుల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా.. ఫిబ్రవరి 9న (ఆదివారం) జరిగిన ఎన్ కౌంటర్లో ఈసారి ఏకంగా 31 మంది మరణించారు. దండకారణ్యంలోకి దూసుకుపోతున్న భద్రతా దళాలు.. మావోల రహస్య ప్రాంతాలను జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలోనే నిత్యం భద్రతా దళలా, మావోల మధ్య కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.


తాజాగా.. ఛత్తీష్ గఢ్ బీజాపూర్ జిల్లాల్లోని నేషనల్ పార్క్ ప్రాంతంలోని అడవుల్లో భద్రతా దళాలు భారీ సెర్చింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారికి ఎదురైన మావోలతో పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది నక్సలైట్లు చనిపోయినట్లు బస్తర్ ఐజీ పి.సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు చనిపోగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. గాయపడిన జవాన్లను ఆసుపత్రికి తరలించిన భద్రతా దళాలు.. వారికి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

నేషనల్ పార్క్ ఏరియాలో భారీ కూంబింగ్ చేపట్టిన పోలీసు దళాలు.. నక్సలైట్ల ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆయా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బస్తర్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం అడవుల్లో ఎన్ కౌంటర్ ప్రారంభమైనట్లు తెలిపారు.


భద్రతా దళాల వైపు నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్స్ నుంచి ఒకరు, స్పెషన్ టాస్క్ ఫోర్స్ నుంచి మరొక జవాను ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్లో మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. మరణించిన నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన పోలీసులు.. వారి గుర్తింపు కొనసాగుతోందని తెలిపారు. భారీ స్థాయిలో ఆ ప్రాంతంలో సెర్చింగ్ కొనసాగుతోందని వెల్లడించారు.

ఇటీవల కాలంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు.  ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ ఘటనలు అధికంగా నమోదయ్యాయి. కొత్త ఏడాదిలోని మొదటి నెలలోనే దాదాపు మూడు ఎన్ కౌంటర్లు చోటుచేసుకున్నాయి.

జనవరి 16న ఛత్తీస్‌ గఢ్ – తెలంగాణ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 17 మంది నక్సలైట్లు చనిపోయారు. ఈ  ఎన్ కౌంటర్లోనే నక్సలైన్ల అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం అందింది. అలాగే.. జనవరి 21 న ఛత్తీస్‌ గఢ్ – ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ జిల్లా కుల్హాడీఘాట్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు – మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రా రెడ్డి అలియాస్ చలపతి సహా 24 మంది మావోయిస్టులు మరణించారు. చలపతి మావో పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనపై  ఏకంగా రూ. కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. అంతటి కీలక నేత మరణంతో మావోలకు పెద్ద తగిలింది.

Also Read : గిగి వర్కర్లకు ఇక నో టెన్షన్.. వారిపై కేంద్రం స్పెషల్ ఫోకస్

మొదటి నెలలోనే రెండు భారీ ఎన్ కౌంటర్లు జరగగా.. మంత్ ఎండింగ్ లో మరో ఘటన జరిగింది. జనవరి 31  బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర్‌చోలి అడవుల్లో భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్‌లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో వివిధ భద్రతా దళాలు పాల్గొని ఆపరేషన్ ను విజయవంతం చేశాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా 202, సీఆర్‌పీఎఫ్ 222 భద్రతా దళాలు పాల్గొన్నాయి.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×