BigTV English

Attack on Manipur CM Convoy: మ‌ణిపూర్ సీఎం కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. సిబ్బందికి గాయాలు..!

Attack on Manipur CM Convoy: మ‌ణిపూర్ సీఎం కాన్వాయ్‌పై  ఉగ్రదాడి.. సిబ్బందికి గాయాలు..!

Terror Attack on Manipur CM Convoy Attack: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ కాన్వాయ్‌పై సోమవారం మెరుపు దాడి జరిగింది. ఈ దాడిలో ఓ భద్రతా సిబ్బంది గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగినట్లు అధికారులు తెలిపారు.


మణిపూర్ సీఎం భద్రతా కాన్వాయ్ వాహనాలపై పలు మార్లు తుపాకీతో కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో భద్రతా సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయినట్లు తెలిపారు. సీఎం ముందస్తు కాన్వాయ్ సమస్యాత్మక ప్రాంతమైన జిరిబామ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని


జిరిబామ్ ప్రాంతంలో రెండు పోలీస్ ఔట్ పోస్టులు, ఒక ఫారెస్ట్ బీట్ అధికారి కార్యాలయం దాదాపు 70 ఇళ్లను శనివారం దుండగులు తగలబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీ నుంచి ఇంఫాల్‌కు బయలు దేరిన సీఎం బిరేన్ సింగ్, జిరిబామ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రణాళిక వేసుకున్నారు. జిరిబామ్‌కు బయలు దేరిన సీఎం కాన్వాయ్‌పై కూడా దాడి జరిగింది.

Tags

Related News

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Social Media Ban: నేపాల్‌లో హింసాత్మకంగా యువత నిరసనలు.. కాల్పుల్లో 20 మంది మృతి

Amruta Fadnavis: బీచ్‌‌ను శుభ్రం చేసిన సీఎం భార్య.. ఆమె డ్రెస్ చూసి నోరెళ్లబెట్టిన జనం

NDA Cheap Tricks: ఆహా.. బీహార్ అంటే కేంద్రానికి ఎంత ప్రేమ.. ఇవేం చీప్ ట్రిక్స్?

Drugs Case: చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు

×