E-Paper
Advertisement

Manish Sisodia : అరెస్ట్ పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. కస్టడీలో ప్రశ్నిస్తున్న సీబీఐ..

Manish Sisodia : అరెస్ట్ పై సుప్రీంకోర్టుకు సిసోడియా.. కస్టడీలో ప్రశ్నిస్తున్న సీబీఐ..
Advertisement

Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడుగా ముందుకెళుతోంది. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసింది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు చేసి సంచలనం సృష్టించింది.
కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నారు.

సీబీఐ అరెస్టు చేయడంపై మనీష్ సిసోడియా న్యాయపోరాటం చేస్తున్నారు. తన అరెస్ట్ ను, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేస్తున్న తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆదివారం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. సిసోడియాను ఐదురోజుల సీబీఐ కస్టడీకి ఇస్తూ ఢిల్లీ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Advertisement

సిసోడియా కస్టడీపై ఢిల్లీ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఐదురోజుల కస్టడీలో సిసోడియాను విచారించే చోట సీసీటీవీ ఉండాలని స్పష్టం చేసింది. ఆ ఫుటేజ్‌ను సీబీఐ భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. సిసోడియాకు 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఒక అరగంటపాటు తన తరఫు న్యాయవాదులను కలుసుకునే అవకాశం కల్పించాలని సూచించింది. వారిమధ్య జరిగే సంభాషణను దర్యాప్తు సంస్థ అధికారులు వినకూడదని స్పష్టం చేసింది. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు ఆయన సతీమణితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వైద్యులు సూచించిన మందులు వేసుకునేందుకు సిసోడియాకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×