BigTV English

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..

Odisha train accident news today(Latest breaking news in telugu): ఒడిశాలో ఘోర రైలు ప్రమాద ప్రభావం ఇతర రైలు సర్వీసులపై పడింది. ఈ ఘటన నేపథ్యంలో 43 రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరో 38 రైళ్లను టాటానగర్‌ స్టేషన్‌ మీదుగా మళ్లించినట్లు ప్రకటించారు. హౌరా – పూరీ సూపర్‌ఫాస్ట్‌, హౌరా -బెంగళూరు సూపర్‌ఫాస్ట్‌, హౌరా -చెన్నై మెయిల్‌, హౌరా -సికింద్రాబాద్‌, హౌరా -హైదరాబాద్‌, హౌరా -తిరుపతి, హౌరా -పూరీ సూపర్‌ఫాస్ట్‌ , హౌరా -సంబల్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ , సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.


మరోవైపు బెంగళూరు – గువాహటిరైలును విజయనగరం, టిట్లాగఢ్‌, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో ఉన్న చెన్నై సెంట్రల్‌-హావ్‌డా రైలును జరోలి మీదుగా, వాస్కోడగామా-షాలిమార్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌ వీక్లీ రైళ్లను కటక్‌, అంగోల్‌ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇక ఒడిశా ఘటనతో గోవా-ముంబై వందేభారత్‌ సర్వీస్ ప్రారంభం వాయిదా పడింది. ప్రధాని మోదీ వందే భారత్ రైలు ఇవాళ ఉదయం వర్చువల్ గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కొంకణ్‌ రైల్వే అధికారులు ప్రకటించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×