E-Paper
Advertisement

Bijapur Encounter: బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ .. 18 మంది మావోయిస్టులు మృతి!

Bijapur Encounter: బీజాపూర్ అడవుల్లో భారీ  ఎన్కౌంటర్ .. 18 మంది మావోయిస్టులు మృతి!
Advertisement

Bijapur Encounter: తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి, మిలటరీ మిలటరీ సభ్యుడు గా పనిచేస్తున్న దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు సేఫ్ గా ఉన్నట్లు ఆ పార్టీ  సాయంత్రం ఓ లేఖను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే… సోమవారం ఉదయం 7 గంటల నుంచి (Bijapur )బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో బంకర్ ఏర్పాటు చేసుకొని ఉంటున్న తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి, మిలటీ సభ్యుడు ఆచూకీ తెలుసుకొని భద్రత బలగాలు అటువైపుగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో దామోదర్ సహా 18 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను భద్రతా బలగాలు, పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. అయితే దామోదర్ మృతి చెందలేదని మావోయిస్టు పార్టీ నుంచి సోమవారం సాయంత్రం ఓ లేఖ విడుదలైంది. అయితే ఈ లేఖ పై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

దామోదర్ పై 75 లక్షల రివార్డు

తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శి దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు పై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 50 లక్షల రివార్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రివార్డును ప్రకటించింది. ములుగు జిల్లా తాడువాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు 1998లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజేషన్ లో పనిచేశాడు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై చేరారు. తొలత దళ సభ్యుడిగా, ఆ తరువాత ఎల్జీ ఎస్, డిప్యూటీ కమాండర్ గా పనిచేశాడు. ఏప్రిల్ 16, 2013 లో పువ్వర్తి ఎన్కౌంటర్లో అప్పటి కేకే డబ్ల్యు కార్యదర్శి మర్రి రవి అలియాస్ సుధాకర్, అతని భార్య పుష్ప, దామోదర్ మృతి చెందినట్లుగా వార్తలు ప్రసారం అయ్యాయి. అయితే ఆ ఘటనలో దామోదర్ మృతి చెందకపోవడంతో కేకే డబ్ల్యూ కార్యదర్శిగా తెలంగాణలో దామోదర్ తన మార్కును చూపించాడు. ఏటూర్ నాగారం పోలీస్ స్టేషన్ పీల్చివేతలో దామోదర్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ సమయంలోనే బిల్ట్ డీజీఎం హత్యలో కూడా కీలక పాత్ర పోషించినట్లుగా వార్తలు వచ్చాయి.

Advertisement

Also Read: BRS: పురపోరు ఖర్చు ఇన్‌ఛార్జీలదే.. తేల్చిచెప్పిన బీఆర్ఎస్ పార్టీ.. భవిష్యత్ లో ఆ నేతల భవిష్యత్ కష్టమే?

పూజారి కాంకేర్ దామోదర్ కు పట్టు ఉన్న ప్రాంతం

బీజాపూర్ జిల్లాలోని ఉసూర్, పూజారి కాంకేర్ అటవీ ప్రాంతం దామోదర్ కు అత్యంత పట్టు ఉన్న ప్రాంతంగా తెలుస్తోంది. అయితే అక్కడ బంకర్ ను ఏర్పాటు చేసుకొని దామోదర్ తన సహచరులతో మకాం వేసినట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలుసుకున్న భద్రతబలకాలు అటువైపుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తొలుత దామోదర్ సహా 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి. సోమవారం సాయంత్రం మావోయిస్టులు దామోదర్ సేఫ్గా తీవ్ర గాయాలతో తప్పించుకున్నట్లుగా లేఖ విడుదలైంది. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలను, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు ఛత్తీస్గడ్ పోలీసులు కానీ, తెలంగాణ పోలీసులు గాని అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. పూజారి కాంకేర్ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇంకా విస్తృత కూంబింగ్ లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనకు ముందు రోజు ఆదివారం బంకర్ సమీపంలో పేలుళ్లు సంభవించి 11 మంది జవాన్లకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో డిఆర్జి, ఎస్టిఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ లను నిర్వహిస్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది.

Advertisement

Also ReadMahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×