Big Stories

MCD Polling : ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల సమరం.. పీఠం దక్కేదెవరికి?

MCD Polling : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ముగిశాయి. ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో బీజేపీ-ఆప్-కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నడిచింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 250 వార్డులున్నాయి. మొత్తం 1,349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7న వెలువడనున్నాయి. ఆప్‌, బీజేపీ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్‌ మాత్రం సంచలనం నమోదవుతుందని ఆశతో ఉంది. వార్డుల పునర్విభజన తర్వాత జరిగిన తొలి మున్సిపల్‌ ఎన్నికలు ఇవే. మరోవైపు గుజరాత్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పూర్తయింది. సోమవారం రెండో దశ పోలింగ్‌ జరగనుంది. అక్కడా ఈ మూడు పార్టీల మధ్యే త్రిముఖ పోరు నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది.

- Advertisement -

1958లో ఏర్పాటైన ఎంసీడీని 2012లో అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ హయాంలో 3 కార్పొరేషన్లుగా విభజించారు. తిరిగి వాటిని ఈ ఏడాది విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు. 2017 మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో గెలుపొందింది. అప్పుడు ఆప్‌ 48, కాంగ్రెస్‌ 27 వార్డులను కైవసం చేసుకున్నాయి.

- Advertisement -

పోలింగ్ నిర్వహణ ప్రక్రియపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ పోలింగ్‌ బూత్‌ ఎక్కడో తెలియని అయోమయ పరిస్థితుల్లో కొందరు, ఓటరు జాబితాలో పేర్లులేకపోవడంతో మరికొందరు చివరకు ఓటేయకుండానే వెనుదిరిగారు. తొలిసారి ఓటు హక్కు వచ్చిన ఓటర్లకు పోలింగ్ కేంద్రం ఎక్కడుందో సరైన సమాచారం లేకపోవడం వల్ల ఓటు వేయలేకపోయారు. ఓటరు జాబితాలు అప్‌డేట్‌ కాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైనట్టు పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు చెప్పారు. మరోవైపు అనేకమంది పేర్లు ఓటర్ల జాబితాల నుంచి గల్లంతయ్యాయని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆరోపించారు. ఈ కుట్రపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఢిల్లీ ముస్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News