BigTV English

Unhealthy Poop Symptoms: మీ మలం నీటిలో తేలుతుందా!.. అయితే ఇదే సమస్య!

Unhealthy Poop Symptoms: మీరు నమ్మినా నమ్మకపోయినా.. మీ మలం మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది. ఆహారంలోని మార్పులు, చిన్నపాటి ఇన్ఫెక్షన్‌లు మీ మలం తేలడానికి కారణం కావచ్చు. అయితే మలం నీళ్లలో ఎందుకు తెలుతుందనే ప్రశ్న మీ మదిలో మొదలైందా.. దానికి కారణాలు ఏంటో చూద్దాం.

Unhealthy Poop Symptoms: మీ మలం నీటిలో తేలుతుందా!.. అయితే ఇదే సమస్య!

Unhealthy Poop Symptoms: మీరు నమ్మినా నమ్మకపోయినా.. మీ మలం మీ ఆరోగ్యం గురించి చాలా విషయాలు చెబుతుంది. ఆహారంలోని మార్పులు, చిన్నపాటి ఇన్ఫెక్షన్‌లు మీ మలం తేలడానికి కారణం కావచ్చు. అయితే మలం నీళ్లలో ఎందుకు తెలుతుందనే ప్రశ్న మీ మదిలో మొదలైందా.. దానికి కారణాలు ఏంటో చూద్దాం.


యునైటెడ్ స్టేట్స్‌లోని మిన్నెసోటా యూనివర్సిటీ వైద్యులు మలం నీటీలో తేలడానికి గల కారణాలను అన్వేషించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సమాధానం తెలుసుకునేందుకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తులను మలం గురించి ప్రశ్నలు అడగటం ప్రారంభించారు. ఇది చాలా ఇబ్బందికర ప్రశ్న కావడంతో సమాధానాలు రాబట్టలేకపోయారు.

దీంతో ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టేందుకు వారికి మరింత ఆసక్తి పెరిగింది. కొందరిని వాలంటీర్లను తీసుకుని ప్రయోగాలు చేసి ఆశ్చర్యమైన సమాధానాలు రాబట్టారు.


  • మలం నీటిలో తేలడానికి వాయువులు కారణమని నిర్థారించారు.
  • మలంలో వాయువు పరిణామాన్ని బట్టి అది తేలుదుంది. లేదా నీటిలో మునుగుతుంది.
  • మలంలో గ్యాస్ పరిణామాన్ని తగ్గించినట్లయితే మునిగిపోతుంది.
  • ఈ తేడాకు కారణం అపరిమితమైన మీథేన్ వాయువు. దీన్నే అధిక అపానవాయువులంటారు.
  • పేగులలో పోగుపడిన అనేక లక్షల సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, ఫంగై మలం తేలడానికి కారణం కూడా కావచ్చు.
  • మలం తేలడానికి మనం తీసుకున్న ఆహారంలోని కణాలు బ్యాక్టీరియాగా మారడం.
  • మనం తినే ఆహారం, ధూమపానం, ఒత్తిడి, అధికంగా ఔషధాల వినియోగం తదితర అంశాలు పేగులలో బ్యాక్టీరియాలో మార్పుకు కారణమై.. మలంలో గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి.

మలంలో గ్యాస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • వామును వేయించి పొడి చేసుకొని నెయ్యి కలిపి ఈ మిశ్రమాన్ని అన్నంతో కలిపి తీసుకోవాలి. ఉదయాన్నే కాలి కడపుతో కాస్త వాము నమిలినా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
  • అన్నం తిన్న వెంటనే సోంపు గింజలను నమిలితే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. నీటిల్లో సోంపు గింజలను ఒక రాత్రంతా నానబెట్టి మరుసటి రోజున ఆ నీటిలో తేనే కలిపి తాగితే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • రోజూ చల్లటి ఒక గ్లాస్ పాలను క్రమం తప్పకుండా తాగితే కడుపులో ఎటువంటి సమస్య రాదని వైద్యులు చెబుతున్నారు. పాలలో ఉండే కాల్షియం కడుపులో ఉత్పత్తయ్యే యాసిడ్‌ను న్యూట్రల్ చేస్తుంది.
  • ధనియాలు,కొత్తిమీర కడుపులో గ్యాస్ నియంత్రణకు చక్కగా పనిచేస్తాయి. ఈ కొత్తిమీర రసాన్ని గోరు వెచ్చని నీరు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ధనియాలను ఎండబెట్టి, వేయించి పొడి చేసిన తర్వాత.. ఆ పొడిని అన్నంలో కలుపుకొని తింటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది.
  • తాజా పండ్లు ఏవైనా రెండు రోజూ తీసుకున్న గ్యాస్ సమస్య రాదట. పండ్లలో ఉండే పీచు పదార్థాలు అజీర్తి, అసిడిటీ నుంచి జీర్ణవ్యవస్థను కాపాడతాయి.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×