E-Paper
Advertisement

Murder : ఢిల్లీలో దారుణం.. డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..

Murder : ఢిల్లీలో దారుణం..  డబ్బులు కోసం బామ్మను హత్య చేసిన మనవడు..
Advertisement

Murder : 15 ఏళ్ల బాలుడు సొంత బామ్మను డబ్బుల కోసం హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో షహదారా ప్రాంతంలో జరిగింది. జల్సాలకు అలవాటు పడిన ఆ బాలుడు స్నేహితుడి సాయంతో ఎవరికీ అనుమానం రాకుండా బామ్మను హత్య చేశాడు. ఆమె దగ్గరున్న డబ్బులు దొంగలించి పారిపోయాడు. జీటీబీ అపార్ట్‌మెంట్‌లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. పక్క వీధిలోనే వారి కుమారుడి కుటుంబం నివాసం ఉంటుంది.

వృద్ధురాలు(77) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో తొమ్మిదో తరగతి చదివే ఆమె మనవడు అతని స్నేహితుడు ఇంటికి వచ్చారు. దుప్పటితో అదిమి ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆపైన పదునైన వస్తువుతో నుదుటిపై గట్టిగా కొట్టడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

Advertisement

అనంతరం బాలులిద్దరూ బీరువాలో ఉన్న రూ.14 వేలను దొంగలించి పారిపోయారు. కొంత సేపటికి ఇంటికి చేరుకున్న వృద్ధుడు భార్య నిద్రలోనే చనిపోయిందని భావించాడు. దీంతో కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతిరాలి నుదుటిపై గాయం ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. అనుమానం వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. దీంతో బీరువా లాకర్‌లో డబ్బు మాయమైనట్లు గుర్తించారు. వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనవడే బామ్మను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×