E-Paper
Advertisement

Modi : వైట్‌హౌస్‌లో విందు .. మోదీ, బైడన్ ఇచ్చిపుచ్చుకున్న కానుకలు ఇవే..!

Modi : వైట్‌హౌస్‌లో విందు .. మోదీ, బైడన్ ఇచ్చిపుచ్చుకున్న కానుకలు ఇవే..!
Advertisement

PM Modi gifts to Joe Biden(Narendra Modi America Tour): అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులకు ప్రత్యేక కానుకలు అందించారు. వారితో కలిసి వైట్‌హౌస్‌లో విందులో పాల్గొన్నారు. బైడెన్‌తో భేటీ అయ్యారు. మోదీకి 20వ శతాబ్దం ప్రారంభంలో చేతితో తయారు చేసిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలీ, పురాతన అమెరికన్ కెమెరాను బైడెన్‌ కానుకగా ఇచ్చారు.

Advertisement

ఇక జో బైడెన్‌కి మోదీ కూడా విలువైన బహుమానాలు అందించారు. జైపూర్‌కు చెందిన కళాకారుడి చేత ప్రత్యేకంగా తయారు చేయించిన గంధపు పెట్టెను ఇచ్చారు. దానిలోపల వినాయకుడి విగ్రహాన్ని పెట్టి బైడెన్‌ దంపతులకు అందించారు. గంధపు పెట్టెపై రాజస్థాన్‌ పురాతన కళాత్మక, అద్భుతమైన నగిషీలు చెక్కి ఉన్నాయి. పెట్టె లోపల ఉన్న వెండి గణేశుడి విగ్రహాన్ని కోల్‌కతాకు చెందిన ఐదో తరం సిల్వర్‌స్మిత్‌ల కుటుంబంతో చేయించారు. వినాయకుడి విగ్రహంతోపాటు వెండి దీపం కూడా ఇచ్చారు.

ఇక అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు ల్యాబ్ గ్రోన్ 7.5 క్యారెట్ గ్రీన్ డైమండ్ ను మోదీ బహూకరించారు. లండన్‌కు చెందిన ఫేబర్ అండ్ ఫేబర్ లిమిటెడ్ ప్రచురించిన, యూనివర్శిటీ ప్రెస్ గ్లాస్గోలో ముద్రించిన ది టెన్ ప్రిన్సిపల్ అనే పుస్తకం మొదటి ముద్రణ కాపీని బైడెన్‌కు ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.

Advertisement

జో బైడెన్‌కు మోదీ బహుమతిగా ఇచ్చిన పెట్టెలో 10 విరాళాలు ఉన్నాయి. గోదానం కోసం పశ్చిమ బంగాల్‌లోని నైపుణ్యం కలిగిన కళాకారులచేత సున్నితంగా చేతితో తయారు చేసిన వెండి కొబ్బరికాయను సమర్పించారు. భూదానం కోసం మైసూర్ నుంచి సేకరించిన సువాసనగల గంధపు చెక్కను ఇచ్చారు. తమిళనాడు నుంచి తెచ్చిన తెల్లనువ్వులను అందించారు. బంగారం దానం కోసం రాజస్థాన్‌ కళాకారుల చేత తయారు చేయించిన 24 క్యారెట్ల బంగారు నాణెంను అందించారు. అలాగే వెండినాణెంను కూడా ఇచ్చారు. గుజరాత్‌ నుంచి సేకరించిన ఉప్పు, మహారాష్ట్ర బెల్లాన్ని ఆ పెట్టెలో ఉంచారు.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×