BigTV English

Coronavirus : వెయ్యికిపైగా జేఎన్.1 కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

Coronavirus : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ అయిన జేఎన్‌.1 కేసుల వ్యాప్తి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1,013 కేసులను నమోదు అయినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ జేఎన్-1 కేసు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన కేసులను ప్రకటించింది.

Coronavirus : వెయ్యికిపైగా జేఎన్.1 కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..

Coronavirus : దేశంలో కొవిడ్‌-19 సబ్ వేరియంట్ జేఎన్‌.1 కేసుల వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 1,013 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్‌ కొత్తగా ఒక జేఎన్-1 కేసు నమోదు అయినట్టు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ప్రకటించింది.


దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులను ప్రకటించింది. కర్ణాటకలో అత్యధికంగా 214 కేసులు నమోదు అయినట్లు తెలిపింది. కేరళలో 154, మహారాష్ట్రలో 70, ఆంధ్రప్రదేశ్‌ లో 189, తమిళనాడులో 22, గుజరాత్‌ లో 76, గోవాలో 66, తెలంగాణ, రాజస్థాన్‌ ల్లో 32 చొప్పున, ఛత్తీస్‌గఢ్‌ లో 25, ఢిల్లీలో 16, ఉత్తర్‌ప్రదేశ్‌ లో 6, హర్యానాలో 5, ఒడిశాలో 3, పశ్చిమబంగాల్‌ లో 2, ఉత్తరాఖండ్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదు అయ్యాయని వెల్లడించింది.

మరోవైపు దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. కొవిడ్-19 సబ్ వేరియంట్ అయిన జేఎన్-1 కేసులు నమోదు అవుతుడటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ వేరియంట్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం సూచించింది.


జేఎన్-1 వ్యాప్తివేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీని ముప్పు తక్కువేనని స్పష్టం చేశారు. దేశంలో ఈ సబ్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ముందస్తు చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 609 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,368గా ఉంది. జేఎన్‌.1 సబ్ వేరియంట్‌ను ప్రత్యేకమైన వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Tags

Related News

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Big Stories

×