BigTV English

Uttar Pradesh Riots : పోలీసులపై 5 వేల మంది రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు.. ఎందుకంటే.?

Uttar Pradesh Riots : పోలీసులపై 5 వేల మంది రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు.. ఎందుకంటే.?

Uttar Pradesh Riots : ఉత్తర ప్రదేశ్ లో ఆదివారం నాడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంభానాలోని షాహి జామా మసీదు సమీపంలో పోలీసులు, ప్రభుత్వ అధికారులపై 5 వేల మంది నిరసనకారులు రాళ్ళ దాడికి పాల్పడ్డారు. అధికారులపైకి కాల్పులు జరిపిన దుండగులు.. ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. క్రమంగా అల్లర్లు తీవ్రమవుతుండడంతో.. ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు భారీ ఎత్తున చేరుకుంటున్నాయి. జిల్లా పోలీసులతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి బలగాల్ని రప్పిస్తున్నారు.


సంభాల్ లోని షాహీ జామా మసీద్.. గతంలో శ్రీ హరిహర్ దేవాలయమని..  1529లో బాబార్ దేాబవాలయ గోడల్ని కూలగొట్టి మసీదుగా మార్చారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ అక్కడ ఆలయ ఆనవాళ్లు ఉన్నాయని, వాటి గోడలపైనే మసీదును నిర్మించారని అక్కడి హిందువుల వాదన. ఈ విషయమై తరాలుగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. కాగా.. ఈ విషయమై చందౌసీలోని సివిల్ సీనియర్ డివిజన్ కోర్టులో నవంబర్ 19న ఒ పిటీషన్ దాఖలైంది. స్థానిక కేలా దేవి ఆలయ కమిటీ సభ్యురాలు.. ఈ మసీదును ఆలయం పై నిర్మించారని.. ఇది హిందువుల ఆస్తి అంటూ కోర్టును ఆశ్రయించారు.

పిటిషన్ ను స్వీకరించిన కోర్టు.. సంబాల్ లోని సాహి జామా మసీద్ ను ఫోటో, వీడియో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ప్రభుత్వ సర్వే బృందం, పోలీస్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సర్వే ప్రారంభించిన రెండు గంటల తర్వాత మసీదు పోగైన వేలాది మంది నిరసనకారులు సర్వేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ సర్వే చేయడానికి వీలు లేదంటూ అధికారులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. సర్వే ప్రారంభమైన రెండు గంటల తర్వాత ఈ దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు అధికారలకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసు వాహనాలకు నిప్పంటించిన నిరసనకారులు.. సర్వే బృందాన్ని అడ్డుకున్నారు.


ఈ ప్రాంతం శాంతిభద్రతల పరంగా సున్నితమైంది కావడంతో.. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అయినా.. వెనక్కి తగ్గని నిరసనకారులు భద్రతా బలగాలపై తీవ్ర స్థాయిలో దాడులకు దిగారు. గుంపులోని వ్యక్తులు పోలీస్ బృందాలపై కాల్పులకు సైతం పాల్పడ్డారు. దాంతో.. నిరసన కారుల్ని అదుపు చేసేందుకు స్థానిక పోలీసులతో పాటు రాపిడ్ రెస్పాన్స్ బృందాలు సంఘటన స్థలానికి చేర్చారు. నిరసనకారులపై బాష్పవాయు గోళాల్ని ప్రయోగించిన పోలీసులు.. లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితుల్ని అదుపులోకి తీసుకువచ్చాయి.

తాజా గొడవల్లో దాదాపు 5,000 మంది పాల్గొనట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. అక్కడ మతపరమైన అల్లర్లు మరింత రేకెత్తించే అవకాశం ఉందని ఇంటిలిజెంట్ వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమయ్యాయి. సర్వేను అడ్డుగాపెట్టుకుని  సంఘ వ్యతిరేక శక్తులు చెలరేగిపోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సంభాల్ ఎస్పీ కృష్ణ కుమార్ వెల్లడించారు.

Also Read : అదానీకి మరో ఎదురు దెబ్బ.. సమన్లు జారీ చేసిన అమెరికా

శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన యూపీ పోలీసులు..  నిరసనకానుల ప్రతీ కదలికను గమనించేందుక డ్రోన్ కెమెరాల్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసు కోర్టు పరిధిలో ఉందన్న జిల్లా పోలీస్ యంత్రాంగం.. న్యాయమూర్తి ఆదేశాలతోనే సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించవద్దని సూచిస్తున్నారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×