Summons to Adani : దేశoవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన వ్యాపారాల్ని విస్తరించుకునేందుకు, తన సంస్థల నుంచి సౌర విద్యుత్ ను ప్రభుత్వ ఏజెన్సీలను అధిక ధరలకు విక్రయించేందుకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై.. వివరణ ఇవ్వాలని అమెరికా అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (యూఎస్ఎస్ఈసీ) సమన్లు జారీ చేసింది.
తన దేశ పెట్టుబడిదారులకు తప్పుడు పత్రాలు చూపించి నిధులు సమీకరించుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణల్లో అదానీ గ్రూప్ వివరణను కోరింది. సమన్లు అందుకున్న రోజు నుంచి 21 రోజుల్లో అమెరికా కోర్టుకు తెలిపాలని సూచించింది. లేదంటే.. వారు తప్పును అంగీకరించినట్లుగా భావించాల్సి ఉంటుందని.. వ్యతిరేక తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియజేసింది. ఈ గుజరాత్ లోని అదానీ ఫామ్ హౌస్ కు, సాగర్ నివాసానికి సమన్లు పంపించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్ ను ప్రభుత్వాలు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వ అధికారులకు భారీ మొత్తాల్లో లంచాలు ఇవ్వజూపరని కొన్నిరోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భారతీయ అధికారులకు, ప్రభుత్వంలోని కీలక నాయకులకు రూ.2,200 కోట్లు లంచం రూపంలో ఇచ్చారనే విషయాలు సంచలనం సృష్టించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 2019-2024 మధ్య పరిపాలించిన ప్రభుత్వంలోని కీలక కార్యనిర్వహక వ్యక్తికి.. రూ.1750 కోట్లు ఇచ్చారని స్పష్టం చేసింది. ఇది వ్యాపార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం సృష్టించింది.
సమన్ల విషయం వెలుగులోకి రావడంపై స్పందించిన అదానీ గ్రూప్.. తాము ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించింది. తనపై వస్తున్న ఆరోపణలపై సరైన వేదిక మీద నుంచి వివరణ ఇస్తామని ప్రకటించింది. స్టాక్ ఎక్జ్సేంజీల్లో లిస్ట్ అయిన తమ గ్రూప్ ల్లో ఏ ఒక్కటి తప్పుడు మార్గంలో కాంట్రాక్టర్ పొందేందుకు ప్రయత్నించలేదని వెల్లడించింది. పైగా అమెరికా విచారణ సంస్థ చెబుతున్నట్టుగా అతనిపై వచ్చిన నేరారోపణలు కంపెనీ మొత్తం వ్యాపారంలో కేవలం 10 శాతానికే సమానమని వెల్లడించింది.
కొన్నాళ్లుగా తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందని చెబుతున్న అదానీ గ్రూప్.. ఈ వ్యవహారం తర్వాత వచ్చిన వివిధ వార్తలపై స్పందించింది. అదానీ గ్రూప్ తో చాలా దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయని వస్తున్న వార్తలు నిరాధారమైనవని తెలిపింది.ముఖ్యంగా అదానీ గ్రూప్ తో కెన్యా ప్రభుత్వం చేసుకున్న రూ. 21 వేల కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది.
Also Read : ఝార్ఖండ్‌లో హేమంత్ సొరేన్ విజయ రహస్యం అదే.. బిజేపీని ఓడించిన మహిళా శక్తి!
ఆ దేశంతో విమానాశ్రయ నిర్వహణ కోసం తాను ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. కేవలం కెన్యా ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేసే కీలక లైన్లలను నిర్మించి నిర్వహించేందుకు మాత్రమే ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. అది సెబీ వెల్లడి నిబంధనల కింద రాదని అందుకే ఆ ఒప్పంద రద్దు విషయాన్ని తెలపాల్సిన అవసరం లేదని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది.