Good Bad Ugly Movie : ప్రస్తుతం అజిత్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైన అందరికీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో అటువంటి క్రేజ్ తమిళ్ లో అజిత్ కి ఉంటుందని చెప్పొచ్చు. అయితే అజిత్ చాలా సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తుంటాయి. కానీ అజిత్ మాత్రం తెలుగు ప్రమోషన్స్ కి హాజరు కారు. ఒకవేళ అజిత్ కూడా తెలుగు ప్రమోషన్స్ కి హాజరైతే ఫ్యాన్ బేస్ ఇంకొంచెం పెరుగుతుంది అనడంలో డౌట్ లేదు. డబ్బింగ్ అవుతున్న అజిత్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది.
Also Read : Devi Sri Prasad : పుష్ప సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాంట్రవర్సీ పైన ఇండైరెక్టుగా రెస్పాండ్ అయ్యాడా.?
ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా అనుకున్నారు. అజిత్ నయనతార కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. శివ దర్శకత్వంలో వచ్చిన విశ్వాసం సినిమా అద్భుతమైన హిట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్ కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. చాలా ఏళ్లు తర్వాత అజిత్ తెలుగులో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, అజిత్ కు ఈ సినిమాకు దాదాపుగా 163 కోట్లు ఇస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అలానే దర్శకుడు అధిక రవిచంద్రన్ కు 15 కోట్లు. ఇచ్చినట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి.
Also Read : Pushpa Kissik Song :సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంటే ఈ రేంజ్ లో ఉంటుంది
ఇకపోతే ఈ సినిమాను సంక్రాంతి కానుక విడుదల చేసే ప్లానింగ్ లో ఉండేది మైత్రి మూవీ మేకర్ సంస్థ. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఏడు రోజులు షూటింగ్ ఇంకా ఫినిష్ కావలసి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేసినట్లు తెలిపారు సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నాం కానీ కుదరదు అని పుష్పా సినిమా ఈవెంట్లో తేల్చి చెప్పేశారు మైత్రి మూవీ మేకర్స్ రవి. ఇక సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాల్లో నుంచి గుడ్ బాడ్ అగ్లీ సినిమా తప్పుకుంది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఈ సంక్రాంతికి దిల్ రాజు మొత్తం రెండు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలానే బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజు సినిమాని కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గత ఏడాది సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నుండి రెండు భారీ సినిమాలు విడుదలయ్యాయి. ఈసారి ఒక సినిమా కూడా రావడం లేదు ఇక ప్రస్తుతం రాబోతున్న పుష్ప సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో అని అందరూ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.