BigTV English

New Ration Cards : మీకు రేషన్ కార్డు లేదా.. అయితే మీకోసమే ఈ న్యూస్.. ఇలా చేయండి లబ్ధి పొందండి

New Ration Cards : మీకు రేషన్ కార్డు లేదా.. అయితే మీకోసమే ఈ న్యూస్.. ఇలా చేయండి లబ్ధి పొందండి

New Ration Cards : రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చాన్నాళ్లుగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల్ని జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల్ని అందరికీ అందించే ఉద్దేశ్యంలో నూతన కార్డుల పంపిణీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.


రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అనేక సంక్షేమ కార్యక్రమాలకు.. రేషన్ కార్డు ప్రాథమిక అర్హతా కార్డుగా ఉంది. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, స్థితిగతుల ఆధారంగా ఈ కార్డుల్ని జారీ చేస్తుంటారు.  దాంతో.. పేదలకు, బలహీన వర్గాల కోసం రూపొందించి, అమలు చేసే పథకాలకు రేషన్ కార్డు ఉన్న వారిని అర్హులుగా గుర్తిస్తుంటారు. ప్రభుత్వ నిర్ణయంతో.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి ప్రయోజనం చేకూరనుంది.

చాన్నాళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం అనేక మంది ఎదురుచూస్తున్నారు. కొత్తగా పెళ్లైన వాళ్లు, ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయి.. వేరుగా ఉంటున్న జంటలు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. వారందరూ.. విడిగా రేషన్ కార్డు లేకపోవడంతో, ప్రభుత్వ ప్రయోజనాల్ని అందుకోలేక పోతున్నారు. దీంతో.. వీరంతా తమకు కొత్త కార్డులు అందించాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. వీటిపై తాజాగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది.


కూటమి ప్రభుత్వం అందించే పథకాల్ని అందరికీ అందించేందుకు.. డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే కార్యచరణ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అంతర్గతంగా ప్రభుత్వ శాఖల మధ్య రేషన్ కార్డులు సంబంధించి విధివిధానాలపై చర్చలు, సమావేశాలు సాగుతున్నట్లు సమాచారం.

నూతనంగా జారీ చేయనున్న రేషన్ కార్డులో మార్పు చేర్పులతో పాటు కొత్త జంటలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు అనుమతి ఇవ్వనుంది. ఇప్పటివరకు ఒకే యూనిట్ గా ఉన్న కుటుంబ సభ్యుల్లో.. ఎవరికైనా నూతనంగా పెళ్లైతే వారిని ఆ యూనిట్ నుంచి తొలగించి కొత్తగా రేషన్ కార్డు అందించనున్నారు. ఈ కారణంగా.. కొత్త యూనిట్ లోని కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. ట

Also Read : ఊరు వాడా కోలాహలం.. వరుసగా పెళ్లి ముహుర్తాలు

పాత కార్డులో స్థానం.. కొత్త కార్డులను రూపొందించనున్న ప్రభుత్వం.. జనవరి లోగా అందరికీ అందించేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ లో దరఖాస్తుల స్వీకరించి..  కొత్త ఏడాదిలో నూతన కార్డులను జారీ చేయనున్నారు.  ప్రజల విజ్ఞప్తుల మేరకు అర్హులైన అందరికీి ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు నెల రోజుల వ్యవధిలోనే కొత్త కార్డులను అందించనున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×