BigTV English

MP Pratap Simha | ఎంపీ ప్రతాప్ సింహ ఎవరు? పార్లమెంట్‌పై దాడితో అతనికి ఏంటి సంబంధం?

MP Pratap Simha | పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా.. డిసెంబర్ 13 బుధవారం లోక్ సభ జీరో అవర్‌లో సందర్శకులు కూర్చునే ప్రాంతం నుంచి ఇద్దరు దుండగులు కిందికి దూకి తమ బూట్లలో నుంచి గ్యాస్ క్యాన్లు తీసి ఎంపీలు కూర్చునే ప్రదేశంలో విసిరారు. దీంతో అక్కడున్న ఎంపీలంతా ఒక్కసారిగా పరుగులు తీశారు. కానీ కొందరు ఎంపీలు మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి.. భద్రతా దళాల సహాయంతో ఇద్దరు దుండగులను పట్టుకున్నారు.

ఈ ఘటనతో లోక్ సభ నిర్వహణలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఘటన సమయంలో దుండగులను అడ్డుకున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ఎస్ టి హసన్ మాట్లాడుతూ.. “ఒక సందర్శకుడిగా వచ్చిన వ్యక్తి బూట్ల లోపల ఒక గ్యాస్ క్యాన్ దాచి పార్లమెంటు లోపలకి ప్రవేశించాడు. ఇలా ఒక సందర్శకుడు గ్యాస్ క్యాన్ తీసుకురాగలిగాడు.. మరో సందర్శకుడు బూట్ల లోపల బాంబు దాచిపెట్టి లోపలకి రాగలడు. ఈ ఘటనతో ఒక విషయం స్పష్టమైపోయింది. పార్లమెంటు లోపల కూడా తగిన భద్రత లేదు, ” అని అన్నారు.

ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అసలు ఆ దుండగులు లోపలికి ఎలా వచ్చరనేది అందరూ అడుగుతున్న ప్రశ్న. దుండగలలో ఒక వ్యక్తి పేరు సాగర్ శర్మ. అతను బిజేపీ ఎంపీ ప్రతాప్ సింహ సిఫారసుతో లోక్ సభ లోపలికి ప్రవేశించాడు. అతని పార్లమెంట్ గేట్ పాస్‌పై ఎంపీ ప్రతాప్ సింహ పేరు స్పష్టంగా కనిపిస్తోందని సమాచారం.

ఎంపీ ప్రతాప్ సింహ కర్ణాటక మైసూరు నియోజకవర్గం నుంచి రెండు సార్లు బిజేపీ టికెట్‌పై విజయం సాధించారు. ఆయన 13 ఏళ్ల పాటు మీడియా రంగంలో పనిచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే మోదీ జీవితంపై ఒక పుస్తకం కూడా రాశాడు.

పార్లమెంటుపై దాడి ఘటనలో ఇప్పటివరకు భద్రతా దళాలు నలుగరిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు లోక్ సభ లోపల దాడి చేయగా.. మరో ఇద్దరు పార్లమెంటు బయట పట్టుబడ్డారు. నిందితుడు సాగర్ శర్మతోపాటు మరో నిందితుడు మనోరంజన్ లోక్ సభ లోపల పట్టుబడ్డాడు. పార్లమెంటు బయట మరో ఇద్దరు ఒక యువకుడు అమోల్ షిండే, ఒక మహిళ నీలం పుత్రిని కూడా అరెస్టు చేశారు.

అయితే సాగర్ శర్మ్ పార్లమెంట్ గేట్ పాస్ మీద బిజేపీ ఎంపీ ప్రతాప్ సింహ పేరు ఎందుకుందనే అంశంపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×