Telangana Speaker : తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు.
స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసే సరికి ఆయన ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికను గురువారం ప్రొటెం స్పీకర్ ప్రకటిస్తారు.
శాసన సభ కార్యదర్శికి బుధవారం ఉదయం ప్రసాద్ కుమార్ నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. కేటీఆర్ వచ్చి నామినేషన్ పత్రంపై సంతకం చేశారు. స్పీకర్ ఎన్నికకు ఒక్కటే నామినేషన్ రావడంతో గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్.. రంగారెడ్డి జిల్లా మర్పల్లిలో జన్మించారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న గడ్డం ప్రసాద్.. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్పీకర్ పదవిని దళిత నేతకు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.