E-Paper
Advertisement

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన
Advertisement

Mumbai: ఎల్ నినో కారణంగా దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ముంబైలోని ఓ ఆర్టీసీ డిపోలోని 10 సీఎన్జీ బస్సులు దగ్ధం కావడం తీవ్ర కలకలం రేపింది. అసలు ఘటన ఎలా జరిగింది?

ముంబైలో ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం

సోమవారం సాయంత్రం ముంబైలోని బెస్ట్ అనిక్ బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పార్క్ చేసి ఉన్న 10 సీఎన్‌జీ బస్సులు పూర్తిగా కాలిపోయాయి. మరో రెండు బస్సులు బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కాకపోతే ఆస్తి నష్టం భారీగానే జరిగిందని అంటున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

తగలబడిన 10 సీఎన్జీ బస్సులు

Advertisement

ప్రమాదానికి గురైన బస్సులు ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నడపబడుతున్న వెట్-లీజు మిడి సిఎన్‌జి బస్సులు. అనిక్ డిపో యార్డ్‌లో సాయంత్రం 5.45 గంటలకు ప్రమాదం సంభవించిందని, వరుసగా నిలిపి ఉంచిన కొన్ని CNG బస్సులు మంటల్లో చిక్కుకున్నాయని బెస్ట్ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం తెలియగానే నాలుగు అగ్నిమాపక యంత్రాలు, ఐదు నీటి ట్యాంకర్లు, ఇతర అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఓ అధికారి తెలిపారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్న అధికారి కొన్ని విషయాలు బయటపెట్టారు. బస్సు సమీపంలో ఉన్న ఏదైనా మండే పదార్థం బయటి నుండి వచ్చిన నిప్పురవ్వ వల్ల మంటలు అంటుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మంటల వల్ల గ్యాస్ పైపులు కరిగిపోయి గ్యాస్ లీకేజీకి దారితీసిందని, దీంతో పరిస్థితి మరింత తీవ్రమైందన్నారు. తొమ్మిది కొత్త బస్సులు కాగా, మూడు ఇప్పటికే సర్వీసులో ఉన్నాయని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.

దర్యాప్తులో నిమగ్నమైన అధికారులు

Advertisement

బెస్ట్ అధికారుల వివరాల ప్రకారం.. కొన్ని నెలలుగా ఆపరేటర్ తన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. ఇప్పటివరకు 140కి పైగా కొత్త బస్సులు చేర్చారని, మరో 50కి పైగా బస్సులను చేర్చే అవకాశం ఉంద్నారు. ధ్వంసమైన 10 బస్సులు కొత్త బస్సులో భాగమేనని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రదేశంలో పేలుడు శబ్దాలు విన్నామని, దూరం నుండి దట్టమైన నల్లటి పొగ కనిపించిందని చెప్పారు. డిపోలోని పరిసర ప్రాంతాల్లో చెట్లు కూడా కాలిపోయాయి.

ALSO READ: మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

అగ్నిప్రమాదానికి సిబ్బంది కారణమా? దానిని అదుపు చేయడంలో ఏమైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే విషయాలపై దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు. అగ్నిప్రమాదం వల్ల బెస్ట్ బస్సుల సంఖ్య మరింత తగ్గింది. ఈ బస్సుల సంఖ్య సుమారు 2800తో అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది. ఈ ఏడాది మే 3 నుంచి బెస్ట్ బస్సులకు సంబంధించి అగ్నిప్రమాదం జరగడం ఇది ఎనిమిదోసారి.

 

Related News

మహాత్మా గాంధీని అవమానించేలా రీల్.. పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

‘దృశ్యం-3’ సినిమా చూసి ప్లాన్.. 2000 కి.మీ ప్రయాణించి.. గొడ్డలితో తండ్రి హత్య!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

Big Stories

Advertisement
×