E-Paper
Advertisement

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు

భర్తతో శారీరక సాన్నిహిత్యానికి నిరాకరించడం, పిల్లలను దూరం చేయడం మానసిక కృూరత్వం: కోర్టు
Advertisement

Denial Of marital intimacy| భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ అవి దీర్ఘకాలం కొనసాగితే మానసిక వేదనకు కారణమైతాయి. ముఖ్యంగా పిల్లలను ఈ గొడవల్లో లాగడం కుటుంబ బంధాలను దెబ్బతీస్తుంది. ఇలాంటి వివాహ వివాదంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

భార్యాభర్తల మధ్య చాలాకాలంగా విభేదాలు

ఈ దంపతులకు 1990 మార్చి 3న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. 1997 అక్టోబర్ 3న వారికి కుమారుడు జన్మించాడు. అయితే కొంతకాలానికి వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. భార్య తరచూ పుట్టింటికి వెళ్లిపోయేదని భర్త ఆరోపించాడు. కుటుంబ సభ్యులు, పంచాయతీలు జోక్యం చేసుకున్న తర్వాతే ఆమె తిరిగి వచ్చేదని పేర్కొన్నాడు. 2008 నుంచి భార్య తనతో శారీరక సంబంధాలకు దూరంగా ఉందని కూడా ఆరోపించాడు. అంతేకాకుండా తన ఆస్తిని భార్య పేరు మీద రాయాలని ఒత్తిడి చేసిందని చెప్పాడు. తన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు పెడతానని బెదిరించిందని ఆరోపించాడు.

2009లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భర్త

Advertisement

భార్య ప్రవర్తన వల్ల మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని భర్త పేర్కొన్నాడు. దీంతో 2009లో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ia) కింద విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. తనపై, కుటుంబ సభ్యులపై భార్య పలు క్రిమినల్ ఫిర్యాదులు చేసిందని ఆరోపించాడు. ఈ పరిణామాలు తనకు వేధింపులుగా మారాయని వాదించాడు.
వాదనలు, ఆధారాలను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భార్య ప్రవర్తన మొత్తంగా మానసిక క్రూరత్వానికి సమానమని పేర్కొంటూ విడాకులు మంజూరు చేసింది.

ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేసిన భార్య

ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని భార్య ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. భర్త, అతని కుటుంబ సభ్యులే సమస్యలకు కారణమని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. తనను దూరంగా ఉండేలా చేసిన పరిస్థితులను కూడా వివరించారు. అయితే భర్త మాత్రం తనతో చాలాకాలంగా శారీరక సాన్నిహిత్యాన్ని నిరాకరించిందని వాదించాడు. తన పిల్లలను కలవకుండా అడ్డుపడుతోందని ఆరోపించాడు.

శారీరక సంబంధాలు లేకపోవడంపై కోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

2008 నుంచి శారీరక సంబంధాలు లేవన్న విషయాన్ని భార్య అంగీకరించినట్లు హైకోర్టు గుర్తించింది. అయితే శారీరక సంబంధాలు లేకపోవడం ఒక్కటే విడాకులకు కారణం కాదని స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య ఉన్న మొత్తం పరిస్థితులను, ప్రవర్తనను పరిశీలించిన తర్వాతే మానసిక క్రూరత్వంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

Also Read: పెళ్లి కోసం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? ఈ 7 సందర్భాల్లో మాత్రం మీకే నష్టం

కొడుకును తండ్రికి దూరం చేయడాన్ని పరిగణించిన కోర్టు

తన కుమారుడిని కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు భార్య అడ్డంకులు సృష్టించిందని భర్త ఆరోపించాడు. కోర్టు ఆదేశాల ప్రకారం కలుసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపాడు. ఒక పేరెంట్‌పై పిల్లలకు వ్యతిరేక భావన కలిగించేలా చేయడం పేరెంటల్ ఏలియనేషన్‌గా కోర్టు పరిగణించింది. ఇది తల్లిదండ్రులతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది.

Also Read: ఒకప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్.. ఇప్పుడు ఏఐ కంపెనీ ఓనర్.. ఎలా ఎదిగాడంటే

విడాకుల తీర్పును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

2025 సెప్టెంబర్ 19న ఢిల్లీ హైకోర్టు భార్య అప్పీల్‌ను కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Related News

కాంగ్రెస్ మిషన్- 2029.. పార్టీలో భారీగా ప్రక్షాళన, రాహుల్ ‘సామాజిక న్యాయం’ మార్క్

లోయలో పడిన మినీ బస్సు, స్పాట్‌లో 24 మంది, తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

అజిత్ ధోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. అసలేం జరిగింది? ఎవరీ గురుపత్వంత్ సింగ్ పన్నూ?

ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు.. పోలీసులే షాక్!

స్కూటీ ముందు స్టైలిష్ ఫోజు.. బుడ్డోడి భవిష్యత్తునే మార్చేసిందోచ్.. షోరూమ్ ఓనర్ బంపర్ గిఫ్ట్!

కంటతడి పెట్టిస్తున్న ఘటన.. బావిలో సామూహిక ఆత్మహత్యల కలకలం, తమిళనాడులో ఘటన

డ్రగ్స్ మహమ్మారిపై ప్రధాని భావోద్వేగం.. యువత భవిష్యత్తుపై ఆవేదన.. నక్సలిజం తరహాలో అంతానికి పిలుపు!

Big Stories

Advertisement
×