Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్, మిస్సమ్మ ఇద్దరూ ఢిల్లీ వెళ్తారు. అయితే ఢిల్లీలో పార్థు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలని మిస్సమ్మ అడిగితే.. చెప్తానని అమర్ క్యాబ్ బుక్ చేసుకుని తాను చెప్పిన ఏరియాలకు వెళ్లాలని డ్రైవర్‌కు చెప్తాడు. డ్రైవర్ సరే అంటూ కారు డ్రైవ్ చేస్తుంటాడు. అమర్ తమ ఆర్మీ ఆఫీసుకు ఫోన్ చేసి పార్థు సెల్ నెంబర్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్తాడు. నెంబర్ తీసుకుని ట్రేస్ చేసి ఆఫీసర్ ఆ నెంబర్ ఢిల్లీలోని కులుమనాలి వెళ్లే హైవేలో మొదటి టోల్‌గేట్ దాటాక స్విచ్చాప్ అయిందని అప్పడే అక్కడే ఇంకో నెంబర్ కూడా స్విచ్చాప్ అయిందని చెప్తాడు. అయితే ఆ రెండో నెంబర్ మనోహరి పేరుతో ఉందా చెక్ చేయమని చెబితే ఆఫీసర్ చెక్ చేసి అవునని చెప్తాడు.
దీంతో అమర్ మరింత అనుమానం పెరుగుతుంది. డ్రైవర్‌కు కులుమనాలి వెళ్లాలి అని చెప్పగానే.. డ్రైవర్ సరే అంటాడు. మిస్సమ్మ మాత్రం మనసులో మనోహరి, పార్థును కులుమనాలి ఎందుకు తీసుకెళ్లింది అనుకుంటూ.. కులుమనాలి వెళ్లేడానికి ఎంత టైం పడుతుంది అని అడగ్గానే.. ఐదు నుంచి ఆరు గంటలు పడుతుంది అని డ్రైవర్ చెప్తాడు. ఇంకాస్త పాస్ట్‌గా వెళ్లలేవా..? అంటుంది. అమర్, మిస్సమ్మ టెన్షన్ పడటం గమనించి నువ్వేం వర్రీ కాకు భాగీ.. మనం వచ్చేశాం కదా పార్థును సేవ్ చేస్తాం.. అంటాడు. మిస్సమ్మ మాత్రం మనసులో దేవుడా మేము వెళ్లే వరకు మనోహరి, పార్థును ఏమీ చేయకూడదు అని ప్రార్థిస్తుంది.
హోటల్ రూంలో ఉన్న మనోహరి నిద్రపోయినట్టు నటిస్తుంది. మనోహరి నిద్రపోతుంది అనుకున్న పార్థు కూడా నిద్రపోతాడు. అయితే మనోహరి లేచి పార్థు నిద్రపోయాడు అని నిర్దారించుకున్న తర్వాత తన ఫోన్ ఆన్ చేసి అందులో వేరే సిమ్ వేస్తుంది. బాత్రూంలోకి వెళ్లి యాదమ్మకు ఫోన్ చేస్తుంది. యాదమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మనోహరి అక్కడి పరిస్థితి ఏంటని అడుగుతుంది. యాదమ్మ మాత్రం నీకోసం ఫోన్ చేసి అలిసిపోయానని ఎన్నిసార్లు చేసినా స్విచ్చాప్ వచ్చిందని చెప్తుంది. పార్థును స్విచ్చాప్ చేయాలంటే నా ఫోన్ కూడా స్విచ్చాప్ చేయాలి కదా అంటుంది మనోహరి. అయితే పార్థును చంపేశావా..? అని యాదమ్మ అడిగితే..
లేదని రేపు చంపబోతున్నానని ఇంతకీ అమర్, భాగీ పడుకున్నారా..? అని అడగ్గానే.. అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అమర్ సార్‌కు ఎవరో ఫోన్ చేసి పార్థు సార్‌ను చంపేస్తున్నాము అని బెదిరించారట. దాంతో ఆయన భాగీని తీసుకుని ఢిల్లీ వచ్చాడు. జాగ్రత్త మనోహరి నువ్వు దొరికిపోతే అక్కడే నీకు సమాధి కడతారు అంటూ యాదమ్మ హెచ్చరిస్తే.. అయితే ఇదంతా ఆ భాగీ చేసి ఉండొచ్చు.. నాకు సమాధి కట్టడం కాదు ఆ పార్థుకు సమాధి కట్టడానికి వాళ్లు ఇక్కడకు వచ్చారు అంటుంది మనోహరి. నువ్వు దొరికిపోతే నీకు చిప్పకూడే మనోహరి అంటూ యాదమ్మ అంటే ఆరును చంపిన కేసులో ఎలా బయటపడ్డానో ఈ పార్థు మర్డర్ కేసులో కూడా అలాగే బయటపడతాను నువ్వు మాత్రం నీ ఫోన్‌లో ఈ కాల్ డిలీట్ చేయ్ అంటూ చెప్పి కాల్ కట్ చేస్తుంది మనోహరి.
తర్వాత సైలెంట్‌గా రూంలోకి వెళ్లి తన ఫోన్‌లో ఉన్న సిమ్ తీసేసి బ్యాగ్‌లో పెట్టుకుని పార్థును చూస్తూ.. గుడ్ నైట్ పార్థు.. సారీ లాస్ట్ నైట్ పార్థు.. రేపు నువ్వు ఆరు దగ్గరకే వెళ్లిపోతావు.. రేపు అమర్, భాగీ సమాధి కడతారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్న విషయం వాళ్లకు తెలియదు అనుకుంటూ పడుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.