Big Stories

Salman house firing case: కాల్పుల కేసులో కొత్త ట్విస్ట్, గుజరాత్‌లో చిక్కిన నిందితులు

Salman house firing case(Bollywood celebrity news): బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబందించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన తర్వాత నిందితులు విక్కీ‌గుప్తా, సాగర్‌పాల్  గుజరాత్‌‌కు పారిపోయారు. భుజ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

సోమవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు, రాత్రి ముంబైకి తీసుకొచ్చారు. మంగళవారం నుంచి విచారణ మొదలుపెట్టనున్నారు. అయితే నిందితులు పన్వెల్‌లోని హరిగ్రామ్ ప్రాంతంలో నెల రోజులుగా ఓ ఇంట్లో మకాం వేసినట్టు తెలుస్తోంది. దానికి సమీపంలోనే సల్మాన్ ఫాంహౌస్ ఉంది. ఈ కేసులో ముగ్గురిని విచారించారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఇంటిని అద్దెకి ఇచ్చిన యజమాని, వీరికి బైక్ ఇచ్చిన ఓనర్, వీళ్లకి సహకరించిన ఏజెంట్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను గుజరాత్‌లో అరెస్ట్ చేశారు. వీళ్లకి ఆయుధాలను బిష్ణోయ్ గ్యాంగ్ సమకూర్చినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

- Advertisement -

బిష్ణోయ్ గ్యాంగ్‌పై ముంబై పోలీసులు ఫోకస్ చేశారు. ఈ గ్యాంగ్‌కి సంబంధించిన వాళ్లు ఈ మధ్యకాలంలో నార్త్‌ఇండియాలో ఎవరైనా అరెస్ట్ అయ్యారా? అనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు. ఈనెల 14న ముంబై బాంద్రాలోని నటుడు సల్మాన్‌ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంటు వద్ద కాల్పుల ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News