BigTV English

Sunitha Williams: నాసా మదిలో కల్పనా చావ్లా విషాద ఘటన.. అందుకే సునీతా విలియమ్స్‌ విషయంలో..

Sunitha Williams: నాసా మదిలో కల్పనా చావ్లా విషాద ఘటన.. అందుకే సునీతా విలియమ్స్‌ విషయంలో..

NASA Cites Kalpana Chawla’s Death incident in Decision to Delay Sunita Williams’ Return: ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకుపోయినా సునీతా విలియమ్స్‌ ఎందుకు భూమికి తిరిగి రాలేకపోతున్నారు.. ?అంతటి నాసాకే సునీతాను ఎందుకు తీసుకురాలేకపోతుంది? టెక్నాలజీ పరంగా.. నిధుల పరంగా తిరుగులేని నాసా ఎందుకు తటపటాయిస్తోంది..? ఈ ప్రశ్న అన్నింటికి ఆన్సర్.. కల్పనా చావ్లా.. అవును.. సునీతా విలియమ్స్ కథ కల్పనా చావ్లాలా ముగిసిపోకూడదనే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచిస్తోంది నాసా.. ఇంతకీ కల్పనా చావ్లాకి.. సునీతా విలియమ్స్‌కు లింకేంటి?


కల్పనా చావ్లా.. మీకు ఈమె గుర్తుందా? అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ఇండో అమెరికన్ కల్పనా చావ్లా.. ఫిబ్రవరి ఒకటి.. 2003లో స్పెస్ షటిల్‌ కొలంబియా రీఎంట్రీ సమయంలో ఆమె మృతి చెందారు. మరో 16 నిమిషాల్లో భూమిపై ల్యాండ్ అవుతారనుకన్న కొలంబియా క్రూ మొత్తం.. స్పెస్ షటిల్‌లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్‌ వల్ల మొత్తం పేలిపోయింది. దీంతో మొత్తం ఆరుగురు ఆస్ట్రోనాట్స్ మృతి చెందారు. అంతుకుముందు 1986 జనవరిలో కూడా స్పెస్ షటిల్ చాలెంజర్‌ పేలిపోయి కూడా అస్ట్రోనాట్స్ చనిపోయారు. నాసా హిస్టరీలో డ్రాస్టిక్ డిజాస్టర్స్‌ ఇవి రెండు ప్రయోగాలు..ఈ రెండు విషయాలు నాసా మనసులో ఎంత బలంగా నాటుకుపోయాయంటే.. సునీతా విలియమ్స్ విషయంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు.

ప్రస్తుతం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఇద్దరు ISSలో చిక్కుకుపోయారు. ఎందుకు బోయింగ్‌ స్టార్ లైనర్‌లో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ కారణంగా.. స్టార్ లైనర్‌లో హీలియం లీకేజ్, థ్రస్టర్స్‌లో సమస్యలను గుర్తించారు. నిజానికి 8 రోజుల పాటు వారు స్పేస్‌లో గడపాలి. కానీ ఇప్పుడు 8 నెలల పాటు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకానొక సమయంలో అసలు వారిని తిరిగి తీసుకురాగలరా? లేదా? అనే డౌట్స్‌ కూడా వచ్చాయి.


Also Read: రెండు నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. ఆరోగ్య సమస్యలు తీవ్రం.. ఏం జరిగిదంటే..

నాసా వారి గురించి ఎంతలా ఆలోచిస్తుందంటే.. స్టార్‌ లైనర్‌లో వారిని తీసుకొచ్చే సాహసం కూడా చేయడం లేదు. వారిద్దరి కోసం కోట్లు ఖర్చు చేసి మరో స్పెస్ షటిల్‌ను పంపేందుకు సిద్దమైంది. దీని కోసం స్పెస్‌ ఎక్స్‌తో చర్చలు జరుపుతోంది. స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 రాకెట్‌ను పంపనున్నారు. ఇది 2025 ఫిబ్రవరిలో వెళ్లనుంది. నిజానికి ప్రస్తుతం ISSలో ఓ స్పెస్‌ ఎక్స్‌కు చెందిన స్పెస్ షటిల్ పార్క్ చేసి ఉంది. సెప్టెంబర్‌లో ఇది భూమి మీదకు రిటర్న్ కానుంది. కానీ ముందుగానే ఇద్దరు రావడానికి సిద్ధమవడంతో సునీతాకు ఇందులో చోటు దక్కలేదు. ISSలో మరో స్పెస్‌ షటిల్ సూయాజ్ కూడా ఉంది. అయితే ఇందులో రష్యన్ ఆస్ట్రోనాట్స్‌ను ముందే రిజర్వ్ అయి ఉన్నారు. అందుకే ఫిబ్రవరిలో ప్లాన్‌ చేసిన ప్రయోగమే ఇప్పుడు దిక్కైంది. నిజానికి ఇందులో నలుగురు అస్ట్రోనాట్స్ వెళ్లాల్సి ఉంది.
కానీ ఇప్పుడు సునీతా, విల్మోర్‌ కోసం ఇద్దరిని మాత్రమే పంపుతున్నారు. రిటర్న్ జర్నీలో నలుగురు తిరిగి రానున్నారు.

మరి బోయింగ్‌ స్టార్ లైనర్ పరిస్థితి ఏంటి? ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ నెక్స్ట్ వీక్ భూమి మీదకు తిరిగి రానుంది. ఇందులో ఎలాంటి క్రూ ఉండరు. ఇప్పటికే దీనికి ముహూర్తం ఫిక్స్‌ చేసింది నాసా..సెప్టెంబర్ ఆరు రోజున అన్‌డాక్‌ చేయనున్నారు. ఇది ఆరుగంటల ప్రయాణం తర్వాత న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ స్పేస్ హార్బర్‌లో ల్యాండ్‌ కానుంది. స్పేస్‌ క్రాఫ్ట్‌ రిటర్న్‌ జర్నీ మొత్తం ఆటోమెటిక్‌గా జరగనుంది. ఈ ఆపరేషన్‌ మొత్తం ఫ్లోరిడా నుంచి కంట్రోల్ చేయనున్నారు. ఓవరాల్‌గా చూస్తే.. నాసా ప్రస్తుతం ఎలాంటి రిస్క్‌ తీసుకునే ఆలోచనలో లేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకోసం ఎన్ని నెలలైనా వెయిట్ చేసేందుకు రెడీ అవుతుంది తప్ప.. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×