BigTV English

National Doctors Day 2024: డాక్టర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటో తేలుసా?

National Doctors Day 2024: డాక్టర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటో తేలుసా?

National Doctor’s Day 2024 Date, History, Significance and Theme: కనిపించని ఆదేవుడు ఊపిరిపోస్తాడు.. కనిపించే ఈ దేవుళ్లు మనకు పునర్జన్మను ప్రసాదిస్తారు. కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి సమయంలో ప్రజలకు దేవుల్లే వైద్యులు.. ఆ సమయంలో వారు అందించిన సేవలను, సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. మందులు వ్యాధులను నయం చేస్తాయోమే కాని.. రోగులను నయం చేసేది మాత్రం డాక్టర్లే.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్ని సేవలు అందిస్తున్న వారి సేవలను స్మరించుకుంటూ జులై 1న నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటారు. అసలు ఈ డాక్టర్స్ డేని ఎందుకు జరుపుకుంటారు. దీని వెనుక చరిత్ర ఏంటో తెలుసుకుందాం..


ఇండియాలోని అత్యంత ప్రసిద్ద వైద్యులలో ఒకరైన డాక్టర్ చంద్ర రాయ్ జయంతి, వర్దంతి సంధర్బంగా జులై1న డాక్టర్స్ డే జరుపుకుంటారు. డాక్టర్ రాయ్ పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పని చేశారు. డాక్టర్ రాయ్ ఎఫ్ ఆర్ సియస్, ఎమ్ ఆర్ సిపి పూర్తిచేసారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, ఇన్ఫెక్షియస్ డిసీజ్ హాస్పిటల్ కోల్‌కతాలో మొట్ట మొదటి సారిగా స్థాపించారు. ఈయన ప్రజలకు అమూల్యమైన సేవలను అందించారు. ఉచిత వైద్యం అందించి సామాన్యులకు నాణ్యమైన సేవలను అందించారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడంటంలో ముఖ్యపాత్ర పోషించారు. అక్కడి ప్రజలకు తన ఇంటిని ,సైతం బహుమతిగా ఇచ్చారంటే ఎంత గొప్ప మనసో అర్దం చేసుకోవచ్చు. డాక్టర్ చంద్ర రాయ్ కి 1961 ఫిబ్రవరి 4న  అత్యున్నత “భారతరత్న” పురష్కారాన్ని అందించింది.

డాక్టర్ చంద్ర రాయ్ ప్రజలకు అందించిన అమూల్యమైన వైద్యసేవలను గుర్తిస్తూ.. 1976లో జాతీయ అవార్డును ప్రకటించారు. ఈ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతి సంవత్సరం జులై1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు డాక్టర్ రాయ్‌కి మాత్రమే కాదు.. అతని అడుగుజాడల్లో నడుస్తూ, జీవితాలను మార్చే.. ఎన్నో సేవలందిచిన వైద్యులందరికీ నివాళి అర్పిస్తూ .జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.


Also Read: ఎంపీగా రషీద్‌ ప్రమాణ స్వీకారం.. అమృత్‌పాల్ మాటేంటి?

జాతీయ వైద్యుల దినోత్సవం ఈఏడాది థీమ్ ఇదే..

జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకల 2024లో థీమ్ ఏంటంటే.. “హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్”. వైద్యులు వారి వైద్య సాధనలో చూపే అంకితభావం, కరుణ, సానుభూతి.. ప్రజల జీవితాలను రక్షించడంలో ఎంతగానో కృషి చేస్తున్న వైద్యు సేవలను గుర్తిస్తూ ఈ థీమ్ ని ప్రవేశపెట్టారు.

ప్రజల ప్రాణాలను, ఆరోగ్యాలను కాపాడేందుకు ఎల్లప్పడు శ్రమించే మీరే నిజమైన హీరోలు.. వైద్యులందరికి జాతీయ వైద్య దినోత్సవ శుభాకాంక్షలు..

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×