BigTV English

Covid 19 subvariant JN.1: మళ్లీ కరోనా.. కేరళలో కొత్త వేరియంట్ కలకలం..

Covid 19 subvariant JN.1: మళ్లీ కరోనా.. కేరళలో కొత్త వేరియంట్ కలకలం..

Covid 19 subvariant JN.1: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వణికిస్తూనే ఉంది. ఆ చీకటి రోజులను మర్చిపోదాం అనుకునేలోపే ఏదో ఒక రూపంలో మళ్లీ విజృంబిస్తూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు లేనప్పటికిని ఇంకా జనాల్లో భయం పోలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లు ఏదో ఒక రూపంలో ప్రజల ఆందోళనను గురి చేస్తూనే ఉన్నాయి.


చైనా కరోనా నుంచి కోల్కోక ముందే మళ్లీ తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్‌.1 కేసులు అమెరికా, ఐస్లాండ్ యూకే, ఫ్రాన్స్ దేశాల్లో కూడా వెలుగు చూశాయి. భారతదేశంలో జేఎన్‌.1 కేసు వెలుగులోకి గమనార్హం. జేఎన్‌.1 మొదటి కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. కరోనా ఫస్ట్ వేరియంట్ కేరళలోనే రావడం గమనార్హం.దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి.

కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 గురించి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందిందన్నారు. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్‌.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, జాగ్రత్తలు పాటించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు.


జేఎన్‌.1 కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చని సీడీసీ సంస్థ తెలిపారు.జేఎన్.1 సోకిన వారికి జ్వరం, నిరంతర దగ్గు త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే అప్రమత్తం అయ్యి వైద్యులకు చూయించాలన్నారు.ఇంకా జేఎన్.1 గురించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదన్నారు. కరోనా వేరియంట్ జేఎన్.1 ప్రమాదకరమా..? కాదా.. అనే వేిషయంపై ఎలాంటి ఆదారాలు లేవని సీడీసీ చెబుతోంది.

Related News

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Big Stories

×