BigTV English

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Rain Effect: నేపాల్ లో వరదలు.. విరిగిపడ్డ కొండచరియలు.. ఇప్పటికే 66కి చేరిన మృతుల సంఖ్య

Rain Effect: పొరుగుదేశమైన నేపాల్ భారీ వర్షాల దాటికి విలవిలలాడుతోంది. భారీ వర్షాలు, వరదలు ఒక్కసారిగా ముంచెత్తగా.. ప్రజల ఆర్తనాదాలు నేపాల్ వ్యాప్తంగా మారుమ్రోగాయి. రక్షించండి మహాప్రభో అంటూ కొందరు.. కొండ చరియలు విరిగిపడి వాటి కింద కాపాడండి అంటూ మరికొందరు రోదించిన తీరు అక్కడి వరదల ఎఫెక్ట్ కి నిదర్శనమని చెప్పవచ్చు. దీనితో సహాయక చర్యలు వేగవంతం చేసినప్పటికీ.. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతుండగా.. అక్కడ రోదనలు మిన్నంటుతున్నాయి.


నేపాల్ లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 66 మంది ప్రాణాలు కోల్పోగా.. 69 మంది గల్లంతైనట్లు నేపాల్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే వరదల ధాటికి 250 వరకు గృహాలు నీట మునగగా.. సహాయక చర్యల్లో ప్రభుత్వం నిమగ్నమైంది.

సహాయక చర్యల్లో ఎటువంటి లోటు లేకుండా చూస్తున్నట్లు నేపాల్ హోమ్ మంత్రిత్వ శాఖ మంత్రి దిల్ కుమార్ తెలిపారు. అయితే వరదల కారణంగా ఖాట్మండు లోయలోనే 34 మంది మృత్యువాత చెందినట్లు అధికారికంగా పోలీస్ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం 66 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఖాట్మండు లోయలో సుమారు 40 లక్షల మంది జనాభా నివసిస్తున్నట్లు.. కొండ చరియలు విరిగిపడడంతో.. మృతుల సంఖ్య పెరిగింది. అలాగే భారీ వరదల కారణంగా నేపాల్ లోని రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీనితో రాకపోకలు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోగా.. వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. నేపాల్ లోని ఖాట్మండులో భారీ వర్షాల ధాటికి, 226 గృహాలు నీటి మునగగా.. పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది సహాయక చర్యలో పాల్గొంటున్నారు. పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న వారిపై కొండ చరియలు విరిగిపడడంతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. ప్రజలు ఎవరూ రహదారులపైకి రావద్దని, అలా వచ్చి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని అక్కడి ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక బోట్ల ద్వారా నీట మునిగిన ప్రాంతాల నుండి ప్రజలను ప్రత్యేక బలగాలు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నాయి.


Also Read: President Murmu: మహిళలపై ఉన్న మైండ్ సెట్ మారాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు

ఇది ఇలా ఉంటే నేపాల్ దేశ వ్యాప్తంగా మూడు రోజులపాటు అన్ని పాఠశాలలకు సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను సైతం నిలిపివేయాలని ప్రకటన జారీ చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు సైతం ఆటంకం ఏర్పడగా.. విద్యుత్ పునరుద్ధరణ చర్యలలో విద్యుత్ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా భారీ వర్షాలు, వరదల కారణంగా.. నేపాల్ లో వందలాది మంది మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే వరదలు వాటికి గల్లంతైన వారికోసం ప్రత్యేక బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా.. క్షతగాత్రులకు వైద్యం సకాలంలో అందించే పనిలో ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ నిమగ్నమైంది. ఇలా పొరుగు దేశం నేపాల్ భారీ వరదల ధాటికి అస్తవ్యస్తం కాగా.. ప్రజల హాహాకారాలు ఇంకా అక్కడ వినిపిస్తున్నాయి.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×