BigTV English

New districts in Ladakh: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

New districts in Ladakh: అమిత్ షా కీలక ప్రకటన..కొత్తగా 5 జిల్లాలు

Centre to create 5 new districts in Ladakh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ విజన్ ప్రకారం..లడఖ్ అభివృద్ధి, శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


ప్రస్తుతం రెండు జిల్లాలు లేహ్, కార్గిల్ ఉండగా..అదనంగా మరో ఐదు జిల్లాలు నూతనంగా ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు కొత్త జిల్లాల పేర్లను జన్‌స్కర్, డ్రాస్, శామ్, నుబ్రా, చంగ్‌థంగ్‌గా పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని తెలిపారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎలక్షన్స్..బీజేపీ అభ్యర్థుల జాబితా రిలీజ్


జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా కొత్త జిల్లాల ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×