BigTV English

Modi Ji Thali : మోదీజీ థాలి.. అమెరికా రెస్టారెంట్ లో తయారీ.. స్పెషల్ ఏంటంటే?

Modi Ji Thali : మోదీజీ థాలి.. అమెరికా రెస్టారెంట్ లో తయారీ.. స్పెషల్ ఏంటంటే?

Modi Ji Thali(Narendra modi news telugu) : ప్రధాని మోదీ ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశానికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. అక్కడ ఉండే ప్రవాసులు మోదీకి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాని మోదీ త్వరలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పీఎంకు ఘన స్వాగతం చెప్పేందుకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా స్పెషల్ థాలి వంటకం రెడీ చేసింది అమెరికాలోని ఓ రెస్టారెంట్.


న్యూజెర్సీలో ఓ రెస్టారెంట్ మోదీజీ థాలి పేరుతో ఈ వంటకం తయారు చేస్తోంది. ఈ వంటకాన్ని శ్రీపాద్ కులకర్ణి అనే చెఫ్ తయారు చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ వంటకాలు ఇందులో ఉంటాయి. కిచిడీ, రసగుల్లా, సర్సన్ కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, దోక్లా, చాంచ్, పాపడ్ ఈ థాలిలో ఉంటాయి.

భారత్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలతో 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఏడాదిగా యూఎన్ డిక్లేర్ చేసింది. దీనికి గుర్తుగా మిల్లెట్స్ తో మోదీజీ థాలి చేస్తున్నారు. వంటకాల తయారీకి మిల్లెట్స్ నే ఉపయోగిస్తున్నారు. ప్రవాస భారతీయుల విజ్ఞప్తితో ఈ వంటకాన్ని తయారు చేస్తున్నామని రెస్టారెంట్ యాజమాని తెలిపారు.


కేంద్ర విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కు అంకితం చేస్తూ మరో స్పెషల్ థాలి చేయించాలని ఆ రెస్టారెంట్ యజమాని భావిస్తున్నారు. దాని పేరు డాక్టర్ జైశంకర్ థాలిగా పెట్టనున్నారు. మోదీ పేరుతో ఇలా వంటకాలు చేయడం తొలి సారి కాదు. గతేడాది సెప్టెంబర్ 17న మోదీ బర్త్ డే సందర్భంగా 56 ఇంచ్ మోదీ థాలిని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ తయారు చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానంతో ప్రధాని మోదీ అమెరికా వెళుతున్నారు. జూన్ 21 న యూఎస్ లో అడుగుపెడతారు. అమెరికా ప్రెసిడెంట్ జూన్ 22న మోదీకి డిన్నర్ ఇవ్వనున్నారు. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాక్ సుల్లివన్ జూన్ 13న ఢిల్లీ రానున్నారు. రెండురోజుల పర్యటనలో వివిధ అంశాలు చర్చించనున్నారు. మోదీ అమెరికా పర్యటనకు వారం ముందే ఆయన భారత్ వస్తున్నారు.

Tags

Related News

First 3D Printed House: దేశంలో తొలి త్రీడీ ప్రింటెడ్ ఇల్లు.. కేంద్రమంత్రి ప్రారంభం, తక్కువ ఖర్చు కూడా

Cough Syrup Deaths: దగ్గు మందు తాగిన ఆరుగురు చిన్నారులు మృతి.. ఈ సిరప్ లు బ్యాన్.. దర్యాప్తు చేపట్టిన కేంద్రం

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్ సంచలన నిర్ణయం

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం

UP News: 75 ఏళ్ల వయస్సులో పెళ్లి.. ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతి రోజే ప్రాణాలు విడిచిన వరుడు

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

LPG Cylinder Price: పండగ వేళ సిలిండర్ ధరలకు రెక్కలు.. ఆపై కేంద్రం మరొక శుభవార్త

TVK Vijay: నాపై ప్రతీకారం తీర్చుకోండి.. తొక్కిసలాట ఘటనపై హీరో విజయ్ స్పందన

Big Stories

×