BigTV English

Telugu States CMs Meeting Live updates: ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Telugu States CMs Meeting Live updates: ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Chandrababu & Revanth Meeting Live updates: హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అంతకంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బాబుకు అందజేశారు.


ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి చంద్రబాబుతోపాటు ముగ్గురు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్థన్, సీఎస్ నీరభ్ కుమార్, ఐఏఎస్ లు కార్తికేయ మిశ్రా, రవిచంద్ర పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలకు సంబంధించి వీరు చర్చిస్తున్నారు.

తొలుత ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమావేశమై.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపారు.


అయితే, హైదరాబాద్‌లో సమావేశమై రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగుదామంటూ చంద్రబాబు లేఖ రాయగా, అందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సానుకూలంగా స్పందించడంతో ఇద్దరు నేతలు నేడు సమావేశమయ్యారు.

Also Read: గోవా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు

ఎజెండాలోని అంశాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనర్ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి పలు కీలక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో పలుమార్లు చర్చలు జరిపినా కూడా కొలిక్కి రాలేదు. ఇరు రాష్ట్రాల సీఎం భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు. అవేమంటే..

  • రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలకు సంబంధించి చర్చించాలని..
  • విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించాలని..
  • ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలపై చర్చించాలని..
  • పెండింగ్ విద్యుత్ బిల్లులపై చర్చించాలని..
  • విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాల విషయమై చర్చించాలని..
  • ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపుల విషయమై చర్చించాలని..
  • లేబర్ సెస్ పంపకాల విషయమై చర్చించాలని..
  • ఉద్యోగుల విభజన అంశాల విషయమై చర్చించాలంటూ ఎజెండా అంశాలను ఖరారు చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×