BigTV English

Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ కేసు, ఈ వీడియోలు నిజమేనని రిపోర్టు.. ఇక

Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ కేసు, ఈ వీడియోలు నిజమేనని రిపోర్టు.. ఇక

Prajwal Revanna case updates(Today news paper telugu): కర్ణాటక రాజకీయాలను జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. ఈ కేసు వేగవంతం చేయాలని సిట్ భావిస్తోంది. ఆయా వీడియో ఉన్న బాధితులను విచారించేందుకు సిద్దమవుతోంది.


జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో బయటకు వచ్చిన వీడి యోలు నిజమేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. అవి మార్ఫింగ్ చేసినవి కావని వెల్లడించింది. ఇందులో గ్రాఫిక్స్‌తోపాటు యానిమేషన్ ఎక్కడా ఉపయోగించలేదన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు సారాంశం. దీనికితోడు వీడియోల్లో కేవలం మహిళలు మాత్రమే కనిపించారు.

33‌ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ పెన్‌డ్రైవ్ వ్యవహారం బయటపడి దాదాపు మూడు నెలలు అయ్యింది. ఆయన అరెస్టు అయి దాదాపు రెండు నెలలు గడుస్తోంది. ల్యాబ్ రిపోర్టు రావడంతో దర్యాప్తును మరింత వేగవంతం చేసుకుందు కు సిట్ రెడీ అయ్యింది. అంతేకాదు ఛార్జ్‌షీట్ వేసేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. వాటిలో వీడియోల్లో కనిపించిన మహిళలను విచారించాలని భావిస్తోంది. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది సిట్. ఆ దిశగా అడుగులు వేస్తోంది.


ALSO READ: రోడ్డు ప్రాజెక్టులతో ఉద్యోగ ఉపాధి.. కేంద్రం కసరత్తు

లోక్‌సభ ఎన్నికల తొలి విడత ఎన్నికల పోలింగ్ తర్వాత జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పదుల సంఖ్యలో ప్రజ్వల్ మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది.
అంతేకాదు ప్రజ్వల్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. హసన్ నుంచి పోటీ చేసిన ప్రజ్వల్ ఓటమి పాలైన విషయం తెల్సిందే.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×