BigTV English

Nitish Kumar : ‘సిగ్గులేని వ్యాఖ్యలు.. ఇంత దిగజారుతారా’.. బీహార్ సీఎంపై ప్రధాని మోదీ ఆగ్రహం

Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో చేసిన జానభా నియంత్రణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు చదువుకున్నవారైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆయనపై తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో నితీశ్ కుమార్‌పై మండిపడ్డారు.

Nitish Kumar : ‘సిగ్గులేని వ్యాఖ్యలు.. ఇంత దిగజారుతారా’.. బీహార్ సీఎంపై ప్రధాని మోదీ ఆగ్రహం

Nitish Kumar : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం అసెంబ్లీలో చేసిన జానభా నియంత్రణ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు చదువుకున్నవారైతే గర్భం రాకుండా శృంగారం ఎలా చేయాలో తెలుస్తుందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో.. ఆయనపై తారాస్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ విషయంలో నితీశ్ కుమార్‌పై మండిపడ్డారు.


మధ్యప్రదేశ్‌లో బుధవారం నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇండియా కూటమికి చెందిన ఓ ప్రముఖ నాయకుడు (నితీశ్ కుమార్‌ని ఉద్దేశిస్తూ) అసెంబ్లీలో సిగ్గులేకుండా అసభ్య పదజాలం వాడారు. ఇండియా కూటమిలోని ఏ ఒక్క నాయకుడు కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించలేదు. వాళ్లు ఇంకెంత నీచంగా దిగజారిపోతారు. దేశాన్ని అవమానంపాలు చేస్తున్నారు. అసెంబ్లీలో తమ తల్లులు, చెల్లెళ్లు మధ్యే సిగ్గుమాలిన పదజాలాన్ని వాడారు. అసలు మహిళల గురించి ఆలోచించే పద్ధతి ఇదేనా? ఇలాంటి వాళ్లు దేశం కోసం పని చేయగలరా? అలాంటి వ్యక్తుల్ని మీరు (ప్రజలు) గౌరవించాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటు వేసేటప్పుడు నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలని బీజేపీ నాయకులు కూడా చెబుతున్నారు.

నితీశ్ కుమార్ ఏం చెప్పారు?
బిహార్‌లో ఇటీవల నిర్వహించిన కులగణన నివేదికను నితీశ్ కుమార్ అసెంబ్లీలో మంగళవారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భర్తల చర్యల వల్లే జననాలు పెరిగాయని, అయితే చదువుకున్న మహిళలకు భర్తని ఎలా నియంత్రించాలో తెలుసని, అందుకే జననాల రేటు తగ్గిందని అన్నారు. అసెంబ్లీలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన మహిళల గౌరవానికి భంగం కలిగేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు విమర్శించారు. అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, ఆయన మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, తక్షణమే తన పదవికి రాజీనామా చేసి మానసిక వైద్యుడిని సంప్రదించాలని బీజేపీ ఫైర్ అయ్యింది. జాతీయ మహిళా కమిషన్ కూడా మండిపడింది.


క్షమాపణలు చెప్పిన నితీశ్ కుమార్
జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ క్షమాపణలు కోరారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. “నేను నా మాటలను వెనక్కి తీసుకున్నా. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. స్త్రీ విద్య గురించి నేను మాట్లాడాను.కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. క్షమించండి” అని నితీశ్ అన్నారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×