BigTV English

AAP MP Sanjay Singh: ఇక సమరమే.. ఆప్ శ్రేణులకు సంజయ్ సింగ్ పిలుపు..

AAP MP Sanjay Singh: ఇక సమరమే.. ఆప్ శ్రేణులకు సంజయ్ సింగ్ పిలుపు..
Sanjay Singh Released From Jail
Sanjay Singh Released From Jail

AAP MP Sanjay Singh Released From Jail: సంబరాలు చేసుకునే సమయం కాదు.. ఇది పోరాడే సమయం అని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆరు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీం కోర్ట్ మంజూరు చేసిన బెయిల్‌ను అనుసరించి బుధవారం సాయంత్రం సింగ్ జైలు నుంచి బయటకువచ్చారు.


తీహార్ జైలు వెలుపల గుమిగూడిన ఆప్ మద్దతుదారులు సంజయ్ సింగ్‌కు పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. ఆయన మీద పూల వర్షం కురిపించారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు నినాదాలతో తీహార్ జైలు పరిసరాలను హోరెత్తించారు. సంజయ్ సింగ్ విడుదల అతనికి మాత్రమే కాదు, ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్ట్‌తో చిన్నబోయిన ఆప్ శ్రేణులకు పెద్ద ఉపశమనం. అతని రాక ఆప్ కార్యకర్తలకు మరింత ప్రోత్సాహానిస్తోంది.

Also Read: AAP MP Sanjay Singh: మనీలాండరింగ్ కేసు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్..


జైలు నుంచి విడుదలైన సందర్భంగా సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు, ఇది పోరాట సమయం.. ఇక సమరమే అని ఆప్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి సింగ్ నేరుగా కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ను కలిశారు.

Tags

Related News

Solar Storm: భూమికి మరో ముప్పు.. ముంచుకోస్తున్న సౌర తుఫాన్..

India Post: బిగ్ షాకిచ్చిన పోస్టల్.. అక్కడికి అన్నీ బంద్.. వాట్ నెక్స్ట్!

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..

September Holidays: సెప్టెంబర్‌లో సగం రోజులు సెలవులే.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Chief Ministers: అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా మూడో స్థానంలో చంద్రబాబు

Big Stories

×