BigTV English

Odisha Assembly Election Results 2024: నవీన్ డబుల్ హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్

Odisha Assembly Election Results 2024: నవీన్ డబుల్ హ్యాట్రిక్ ఆశలకు బ్రేక్

Odisha Assembly Elections BJP Leading Majority Naveen Patnaik Back Step: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార బిజూ జనతాదళ్ పార్టీ ఫలితాల సరళిలో వెనుకంజలో ఉంది. దాదాపు ఓటమి దిశగా పతనం అంచున పయనిస్తోంది. ఇప్పటి వరకు వరుసగా ఐదుసార్లు ఆ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న బీజూ జనతా దళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్.. ఈ సారి డబుల్ హ్యాట్రిక్‌పై కన్నేశారు. కానీ నవీన్ పట్నాయక్ ఆశలు ఆవిరయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార బిజూ జనతా దళ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ దఫా ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​కు బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైంది.


సంబల్ పుర్​లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆధిక్యంలో ఉండగా, పూరీ నుంచి సంబిత్ పాత్రా ముందంజలో ఉన్నారు. బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ కంటాబాంజీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) వెనుకబడింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై బీజేపీ చేసిన వ్యతిరేక ప్రచారం వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం క్షీణించడంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీనిపై నవీన్ పట్నాయక్ మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాగా సుదీర్ఘ కాలంగా పవర్‌లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది.

స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ


మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో బీజేపీ 74, బీజేడీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఫలితాల సరళి ప్రకారం బీజేపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాషాయ పార్టీ మేజిక్ ఫిగర్ దాటి అత్యధిక సీట్లలో ముందుండగా బీజేడీ తక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 12 సీట్లలో ఇతరులు 3 సీట్లలో ముందంజలో ఉన్నారు. ఒడిశాలో అధికార బీజేడీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలో తొలిసారి అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ పయనిస్తోంది. అత్యధిక అసెంబ్లీ సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బిజూ జనతా దళ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ దఫా ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్​కు బీజేపీ నుంచి గట్టి పోటీనే ఎదురైంది.

Also Read: బెంగాల్‌లో దీదీ హవా! స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా తగ్గేదేలే..!

సంబల్ పుర్​లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఆధిక్యంలో ఉండగా, పూరీ నుంచి సంబిత్ పాత్రా ముందంజలో ఉన్నారు. బిజూ జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ కంటాబాంజీ నుంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా డబుల్ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్య‌క్తం చేశారు. కానీ ఈసారి ఒడిశాపై క‌న్నేసిన బీజేపీ.. న‌వీన్ దూకుడుకు బ్రేక్ వేసింది. ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వ ఆధిప‌త్యాన్ని దెబ్బ‌తీయాల‌న్న ఉద్దేశంతోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒడిశాలో ప‌నిచేశాయి. కాంట‌బంజి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న న‌వీక ప‌ట్నాయ‌క్ వెనుకంజ‌లో ఉన్నారు.. ఒడిషాలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా..బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా కొనసాగుతోంది.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×