NationalLatest Updates

Odisha Rail Track: రైళ్లు మళ్లీ రయ్ రయ్.. ఎక్స్‌ప్రెస్ ఆపరేషన్..

odisha train
odisha train

Odisha Rail Track: బాలాసోర్ ప్రమాద ఘటనాస్థలంలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. రైల్వే సిబ్బంది రాత్రనకా.. పగలనకా శ్రమిస్తున్నారు. ఆదివారం రాత్రికి ఒక ట్రాక్ ను పునరుద్ధరించారు. ఆ ట్రాక్ ద్వారా గూడ్స్ రైళ్లను పంపించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి అన్ని ట్రాక్ లను అందుబాటులోకి తెచ్చారు. ఆ మార్గం గుండా ప్రయాణీకుల రైళ్లనూ నడిపిస్తున్నారు. ఉదయం నుంచి పూరీ –హౌరా మార్గాల్లో అన్ని సర్వీసులను తిరిగి ప్రారంభించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇక ప్రమాద స్థలాన్ని రెండు రోజుల్లోనే మళ్లీ ప్రయాణానికి అనువుగా మర్చిన రైల్వే సిబ్బంది పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహా ప్రమాదం నుంచి తేరుకొని పని చేసిన ప్రతీ ఒక్కరినీ ప్రయాణీకులు అభినందిస్తున్నారు.

ఒడిశా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏర్పాటు చేసిన హెల్ప్‌ లైన్‌కు ఎలాంటి కాల్స్ రావడం లేదన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమరన్నాథ్‌. ప్రమాదంలో ఏపీకి చెందిన 12 మందికి స్వల్ప గాయలయ్యాయని చెప్పారు. ప్రస్తుతం విశాఖలో 8 మందికి చికిత్స అందించామని.. జనరల్ బోగీలో ప్రయాణించిన శ్రీకాకుళానికి చెందిన గురుమూర్తి ఒక్కరే మృతి చెందారని మంత్రి తెలిపారు. ఏపీకి చెందిన ఇద్దరు ఐఎఎస్ అధికారులు సహాయం అందించేందుకు ఇంకా భువనేశ్వర్లో ఉన్నారని మంత్రి తెలిపారు.

Related posts

Bhu Varahaswamy Temple:- సొంతంటి కలను నెరవేర్చే భూ వరాహస్వామి

Bigtv Digital

Security Guard Jobs : అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌లో 321 సెక్యూరిటీ గార్డు పోస్టులు..

BigTv Desk

Heroines : ముందు తల్లి అయ్యారు.. ఆ తర్వాతే పెళ్లి చేసుకున్నారు ..

Bigtv Digital

Leave a Comment