BigTV English

Onion Price : కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి.. ఆకాశాన్నంటుతాయా ?

Onion Price : కన్నీరు పెట్టిస్తోన్న ఉల్లి.. ఆకాశాన్నంటుతాయా ?

Onion Price : పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో.. సాటి మధ్యతరగతి, పేద కుటుంబాల జీవనం కష్టతరమైపోతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందే తప్ప.. జీతాలు పెరగడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతుంటే.. ఈ సారి ఉల్లి కూడా కన్నీరు పెట్టించేందుకు రెడీ అవుతోంది. మొన్నటి వరకూ టమాటాలు అందని ద్రాక్షగా ఉన్నాయి. ఆ సమయంలో టమాటా పంట చేతికొచ్చిన రైతులకు కాసుల వర్షం కురిసింది. కొందరు రైతులతే కోటీశ్వరులు కూడా అయ్యారు. టమాటా ధర తగ్గిందనుకుంటే.. ఉల్లి ధర ఊపందుకుంటోంది. రోజురోజుకూ ధర పెరుగుతుండటంతో.. ఉల్లి ఉంటే గానీ ముద్దదిగని వారు, సగటు సాధారణ కుటుంబంవారు ఉలిక్కిపడుతున్నారు.


కిలో ఉల్లి ధర ప్రస్తుతం మార్కెట్ లో రూ.80 పలుకుతోంది. ఇది త్వరలోనే రూ.100 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఉల్లి ధర గణనీయంగా పెరిగిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ డేటా కూడా వెల్లడించింది. పెరిగిన ఉల్లి ధర గృహిణులకు కోయకుండా కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి నిల్వలు కావలసినంత లేకపోవడం, దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబర్ లో కొత్త పంట మార్కెట్ లోకి వచ్చేంత వరకూ.. ఉల్లి ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. అంటే.. మరో రెండు నెలల వరకూ ఉల్లి ధరలు భగ్గుమంటాయని అంచనా వేస్తున్నారు. డిమాండ్ తగ్గట్టు ఉల్లిని సరఫరా చేసేందుకు నాఫెడ్, ఎన్ సీసీఎఫ్ సైతం కసరత్తు చేస్తున్నాయి.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×