OTT Movie : ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటీటీలో ఎన్నోరకాల జానర్లలో, సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో మలయాళం సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఒక వృద్ధ జంట చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
తెలుగులో కూడా స్ట్రీమింగ్
ఈ మలయాళం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ పేరు ‘పూక్కలం’ (Pookkaalam). 2023 లో వచ్చిన ఈ మూవీకి గణేష్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో విజయరాఘవన్ (ఇట్టూప్) వంద ఏళ్ల వృద్ధుడిగా ప్రధాన పాత్రలో నటించగా, అతనికి జోడీగా కె.పి.ఎ.సి.లీల (కొచుత్రేసియమ్మ) నటించారు. బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్, అన్ను ఆంటోనీ, సుహాసిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 ఏప్రిల్ 8 న విడుదలైంది. 2023 మే 19 నుంచి జియో హాట్‌స్టార్ (Jio hotstar)లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఇట్టూప్, కొచుత్రేసియమ్మ అనే దంపతులకు వయసు 90 ఏళ్లకు పైగా ఉంటుంది. ఈ వృద్ధ దంపతులు 80 సంవత్సరాలకు పైగా వివాహ జీవితాన్ని గడిపి, నాలుగు తరాల కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటారు. అయితే ఒకరోజు వారి మనవరాలు ఎల్సీ నిశ్చితార్థం జరుగుతుంది. అందరూ సంతోషంగా ఉన్న ఈ సందర్భంలో, ఇట్టూప్‌కి 50 ఏళ్ల క్రితం తన భార్యకు ఎవరో రాసిన ఒక పాత ప్రేమలేఖ దొరుకుతుంది. ఈ లేఖను చూసిన ఇట్టూప్ కి, కొచుత్రేసియమ్మ మీద అనుమానం కలుగుతుంది. గతంలో ఆమె ఎవరితోనో వ్యవహారం నడిపిందని అనుకుంటాడు ఇట్టూప్. దీంతో ఇట్టూప్ భార్య మీద కోపంతో, డివోర్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు.
Read Also : స్మగ్లింగ్ గ్యాంగ్ కే చుక్కలు చూపించే ఆఫీసర్… ఈ క్రైమ్ డ్రామా క్లైమాక్స్ ట్విస్ట్ కు దిమ్మతిరగాల్సిందే మావా
ఈ ఊహించని సంఘటన కుటుంబంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఈ లేఖ రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి మనవరాలు ఎల్సీ ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఇట్టూప్ నియమించిన లాయర్ జిక్కు మోన్ సహాయం కూడా తీసుకుంటుంది. ఫ్లాష్‌బ్యాక్ లో ఇట్టూప్, కొచుత్రేసియమ్మ గత జీవితంలో ఎదుర్కున్న కష్ట నష్టాల గురించి తెలుస్తాయి. కోర్టులో ఈ విడాకుల గురించి వాదనలు కూడా జరుగుతాయి. కొచుత్రేసియమ్మకి ప్రేమ లేఖ రాసింది ఎవరు ? ఇట్టూప్, కొచుత్రేసియమ్మతో విడాకులు తీసుకుంటాడా ? వీళ్ళు మళ్ళీ సంతోషంగా ఉంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.