Pakistan Four Parts| అంతర్యుద్ధాలు, ఆర్థిక సంకోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఒక సమైక్య దేశంగా ఎక్కువ కాలం ఉండదని భారత మాజీ డిజిఎంవో (డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) లెఫ్టెనెంట్ జనరల్ డిబి షెకాట్కర్ జోస్యం చెప్పారు. పాకిస్తాన్ నాలుగు ముక్కలుగా చీలిపోవడం ఖాయమని అన్నారు.
పాకిస్తాన్ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపై చాలా కచ్చితత్వంలో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో చేసిన వైమానిక దాడులు చేసిందని జనరల్ డిబి షెకాట్కర్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ నివ్వడం సంతోషకరమని ఆయన ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయని. ఈ వాస్తవాన్ని పాకిస్తాన్ కూడా అంగీకరించిందని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని మొత్తం 52 దేశాలు ఇండియా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ క మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదిని అమెరికా ఎలా మట్టుబెట్టిందో, భారత్ కూడ అలాగే ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. కేవలం ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారో ఆ ప్రాంతాల్లో మాత్రమే దాడులు చేశాం.” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధం ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటమని, ఇది కేవలం ప్రారంభమని జనరల్ షెకట్కార్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు చాలా రహస్యంగా జరిగాయని.. ఇలా పాకిస్తాన్ భూభాగంపై వైమానికి దాడులు చేస్తున్నట్లు ఢిల్లీలోని బడా అధికారులకు కూడా సమాచారం లేదని ఆయన తెలిపారు.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
“ఇది ఉగ్రవాదులపై యుద్ధం. ఉగ్రవాదులకు సాయం చేసే పాకిస్తాన్ పై యుద్దం. ఉగ్రవాదులను అండగా పాకిస్తాన్ నిలబడితే తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అసలు పాకిస్తాన్ ఒక సమైక్య దేశంగా ఎక్కువ కాలం ఉండదు. దాని అస్తిత్వమే కనుమరుగవుతుంది. మరో అయిదు నుంచి ఏడేళ్లలో పాకిస్తాన్ నాలుగు భాగాలుగా చీలిపోయే అవకాశాలున్నాయి. ఒకటి సింధ్ దేశంగా, ఒకటి బలూచిస్తాన్ దేశంగా, మూడోది ఖైబర్ పష్తూన్ ఖ్వా దేశంగా ఉంటాయి. పాకిస్తాన్ అంటే కేవలం పంజాబ్ రష్ట్రామే మిగిలిపోతుంది. నేను చెప్పేది ఒక్కటే పాకిస్తాన్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అక్కడి సైన్యం, ప్రభుత్వం అవినీతిమయంగా మారాయి. ఈ కారణాలే ఆ దేశాన్ని ముక్కలుగా చీలుస్తాయి.” అని జనరల్ షెకాట్కర్ అన్నారు.
జనరల్ షెకాట్కర్.. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన 1965, 1971 యుద్ధాలలో భారత సైన్యం తరపున ప్రాతినిధ్యం వహించారు.