BigTV English

Andhra Pradesh Tour: పచ్చటి తోటలు, జలపాతాలు మరెన్నో అందాలు ఏపీ సొంతం !

Andhra Pradesh Tour: పచ్చటి తోటలు, జలపాతాలు మరెన్నో అందాలు ఏపీ సొంతం !

Andhra Pradesh Tour: ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో చాలా అందమైన రాష్ట్రం. కృష్ణ , గోదావరి నదులు ప్రవహించే ఈ రాష్ట్రం, చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు పంట పొలాలతో ఎల్లప్పుడూ సహజ సౌందర్యంతో పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. సమ్మర్‌లో ఏపీలోని కొన్ని ప్రదేశాలకు వెళ్లి మీరు సమయాన్ని ఆనందంగా గడపవచ్చు. ఏపీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


అరకు లోయ:
అరకు లోయ తూర్పు కనుమల కొండలలో ఉన్న చాలా అందమైన హిల్ స్టేషన్. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ఆఫ్‌బీట్ గమ్యస్థానం. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు నిత్యం వస్తుంటారు. ఈ లోయ మొత్తం కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది. మీరు కూడా కాఫీ ప్రియులైతే ఈ ప్రదేశాన్ని తప్పక చూడండి. ప్రశాంతంగా సమయం గడపడానికి ఇది చాలా అందమైన ప్రదేశం.

తిరుపతి :
తిరుపతిలోని వెంటటేశ్వర స్వామి ఆలయం మన దేశంలో చాలా ప్రసిద్ధమైన ఆలయం. ఇది ప్రపంచవ్యాప్తంగా మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుండి ప్రజలు ఈ ప్రదేశానికి వస్తారు. ఇది మన దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో కూడా ఒకటి. ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే మీరు తలకోన జలపాతం, చంద్రగిరి కోట ,స్వామి వారి పుష్కరిణి వంటి ప్రదేశాలను కూడా చూడొచ్చు. అంతే కాకుండా దగ్గరలోని శ్రీ కాళహస్తి ఆలయం, పరశురామేశ్వర ఆలయం, ఇస్కాన్ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఈ ప్రదేశాలన్నీ తిరుపతికి దగ్గరగానే ఉన్నాయి.


విశాఖపట్నం:
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటి. ఇది చాలా అందమైన పర్యాటక కేంద్రం.ఇక్కడి ప్రదేశానికి చుట్టూ తిరగడానికి, విశాలమైన బీచ్‌లను ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. వైజాగ్ లోని బీచ్ లు చూడటానికి చాలా మంది ప్రతి రోజు వస్తారు. కొంతమంది ఈ ప్రదేశాన్ని ‘విధి నగరం’ అని పిలుస్తారు. మరికొందరు దీనిని ‘తూర్పు తీర గోవా’ అని అంటారు. ఈ ప్రదేశంలో కైలాసగిరి, కుర్సుర సబ్‌మెరైన్ మ్యూజియం, డాల్ఫిన్ నోస్ లైట్‌హౌస్ , రామ్ కృష్ణ బీచ్ వంటి ప్రదేశాలు కూడా చూడొచ్చు.

విజయవాడ:
విజయవాడ ఏపీలోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడికి దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షించే అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ అనేక హిందూ , బౌద్ధ పర్యాటక ప్రదేశాలు మీకు కనిపిస్తాయి. ఇది అనేక గుహలు, పురాతన దేవాలయాలకు నిలయం. విజయవాడ కనకదుర్గ ఆలయం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. నిత్యం చాలా మంది పర్యాటకులు ఈ ఆలయానికి వస్తారు.

Also Read: ఢిల్లీ టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

తలకోన జలపాతం:
తలకోన జలపాతం ఏపీలోని అత్యంత అందమైన జలపాతాలలో ఒకటి. ఈ జలపాతం చాలా ప్రసిద్ధి చెందింది. దీని చుట్టూ ఉన్న పచ్చని వాతావరణానికి ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. ఇది ఏపీలో ఎత్తైన జలపాతం అని చెబుతారు. ఈ జలపాతం నుండి నీరు 270 అడుగుల ఎత్తు నుండి వస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల దృశ్యం చాలా అందంగా మారుతుంది.

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×