BigTV English

Pakistan: పాకిస్తాన్ కపట నాటకం.. పేర్లతో సహా బయటపెట్టిన భారత్ , టాప్ పోలీసులు, ఆర్మీ అధికారులు

Pakistan: పాకిస్తాన్ కపట నాటకం.. పేర్లతో సహా బయటపెట్టిన భారత్ ,  టాప్ పోలీసులు, ఆర్మీ అధికారులు

Pakistan: పాకిస్థాన్ బుద్ధి ఇంకా మారలేదా? కళ్ల ముందు నిజాలు కనిపిస్తున్నా అబద్దాలు ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తుందా? ఆపరేషన్ సిందూర్ దాడులు, అందులో మరణించినవారు చనిపోయినవారు, ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన వారి పేర్లను సైతం బయటపెడుతోంది. అయినా దాయాది దేశం బుద్ది ఏ మాత్రం మారలేదు. తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన వారి పేర్లను బయటపెట్టింది భారత్. ఇప్పటికైనా ఉగ్రవాదుల గురించి అసలు నిజాలు అంగీకరిస్తుందా?


పేర్లు బయటపెట్టిన భారత్

పహల్‌గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను నేల మట్టం చేసింది భారత్ సైన్యం. ఉగ్రవాదులకు సంబంధించి తొమ్మిది స్థావరాలపై మిస్సైళ్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు భారత్ సైన్యం ప్రకటించింది. టాప్ ఉగ్రవాదుల సంస్థల కీలకంగా పని చేస్తున్న యూసఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ మృతి చెందారు.


లష్కరే తోయిబా ఉగ్రవాది ఖలీద్ కూడా ఈ దాడుల్లో హతమయ్యాడు. కాశ్మీర్​లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించాడు. ఆ తర్వాత తిరిగి పాకిస్తాన్‌కు పారిపోయాడు.  ఆపరేషన్​ సిందూర్‌లో భాగంగా బహవల్​పూర్​ మురిడ్కేలో ఉగ్రవాదులు భారీగా హతమయ్యారు. వారి అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు హాజరైనట్లు భారత్ పదే పదే చెప్పింది.

అంత్యక్రియలకు హాజరైన వారిలో ఆదేశ టాప్ పోలీసులు, ఆర్మీ అధికారుల పేర్లను బయటపెట్టారు రక్షణ‌శాఖ అధికారులు. ఉగ్రవాదుల అంత్యక్రియులకు హాజరైన వారిలో పాకిస్థాన్‌లోని పంజాబ్ ఇన్​స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. అలాగే లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్, బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్ (అడ్మినిస్ట్రేషన్ విభాగం), ఉస్మాన్ అన్వర్, పాకిస్థాన్​ పంజాబ్ శాసనసభ్యుడు మాలిక్ సోహైబ్ అహ్మద్‌లు ఆ జాబితాలో ఉన్నారు.

ALSO READ: ఇండియా దెబ్బకు పాక్ షేక, ఎయిర్ బేస్‌లు తుక్కు తుక్కు

ఇక ఆపరేషన్ సిందూర్ దాడుల్లో తమ యుద్ధ విమానం ధ్వంసమైందని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో దాయాది దేశానికి చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, వైమానిక రక్షణ వ్యవస్థలను కూల్చి వేశామని భారత సైనిక వర్గాలు గతంలో తెలిపాయి. ఈ నేపథ్యంలో పాక్ సైన్యం ఈ ప్రకటన చేసింది.

ఇస్లామాబాద్‌లో వాయు సేన, నౌకాదళ అధికారులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదేశ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణలో వాయు సేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసం అయ్యిందని తెలిపారు. సైన్యానికి ఏ స్థాయిలో నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు.

రెండువారాల తర్వాత.. 

భారత ప్రభుత్వం, వైమానిక విభాగం వార్నింగ్‌తో జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పులు చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని భారత సైన్యం వెల్లడించింది. దాదాపు రెండువారాల తర్వాత అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాత్రి ప్రశాంత వాతావరణ నెలకొందని తెలిపింది. స్వస్థలాలకు వెళ్లొద్దని సరిహద్దు గ్రామాల ప్రజలను జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం హెచ్చరించింది.

పాక్ నుంచి వచ్చిన షెల్స్‌ ఇంకా ఉంటాయని, వాటిని గుర్తించాల్సి ఉందని తెలిపింది. గతరాత్రి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదని, అయినప్పటికీ భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. కొన్నాళ్లుపాటు బలగాలను అక్కడే ఉంచాలని భావిస్తున్నారు అధికారులు.

Related News

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Big Stories

×