BigTV English

CEO Sanjeev Jain arrested: సినిమా స్టయిల్‌లో.. 60 కిలోమీటర్ల భారీ ఛేజింగ్, సీఈఓ అరెస్ట్

CEO Sanjeev Jain arrested: సినిమా స్టయిల్‌లో.. 60 కిలోమీటర్ల భారీ ఛేజింగ్, సీఈఓ అరెస్ట్

CEO Sanjeev Jain arrested(Today’s news in telugu): నిర్మాణ రంగంలో విశేష అనుభవం ఆయన సొంతం. ఏదో విషయంలో  పోలీసులు పలుమార్లు వారెంట్లు జారీ చేశారు… దాన్ని పక్కనపెట్టాడు.. తానొక బిజినెస్‌మేన్ అని, తనను ఎవరు అడుగుతాడని భావించాడు. పోలీసుల కళ్లు గప్పి తిరిగాడు. ఇతగాడి కదలికలపై నిఘా వేసిన పోలీసులు, ఆయన ప్రయాణించిన కారును 60 కిలోమీటర్లు వెంబడించి మరీ అరెస్ట్ చేశారు. సంచలన రేపిన ఈ వ్యవహారం ఢిల్లీలో వెలుగుచూసింది.


గురుగ్రామ్‌కు చెందిన పార్శ్వనాథ్ ల్యాండ్‌మార్క్ డెవలర్స్ సీఈఓ సంజీవ్ జైన్. యూపీకి చెందిన ఆయన 32 ఏళ్లగా నిర్మాణ రంగంలో అనుభవం గడించారు. తన వ్యాపారాన్ని 10 రాష్ట్రాలకు పైగానే విస్తరించాడు. అయితే సంజయ్ జైన్‌పై జాతీయ వినియోగదారుల కమిషన్‌కు చాలామంది ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలో కమిషన్.. సంజీవ్‌కు వారెంట్లు జారీ చేసింది. ఆ తర్వాత పోలీసులు అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది. వీటికి ఆయన స్పందించిన దాఖలాలు లేవు.

చివరకు సంజీవ్ జైన్ వ్యవహారం ఢిల్లీ పోలీసులకు చేరింది. ఆయన కదలికలపై ఓ కన్నువేశారు. సంజీవ్‌ ను అరెస్ట్ చేసేందుకు గురుగ్రామ్‌లో ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. దాన్ని గమనించిన ఆయన అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. సంజీవ్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన కారును వెంబడించారు ఢిల్లీ పోలీసులు. ఒకటి రెండూ కాదు.. ఏకంగా 60 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే యాక్షన్ సినిమాల మాదిరిగా వెంబడించారు. ఎట్టకేలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పోలీసులకు చిక్కాడు.


ALSO READ: మోదీ సాహసోపేత నిర్ణయానికి ఐదేళ్లు పూర్తి

సంజీవ్ జైన్‌ను అరెస్టు చేసిన పోలీసులు, చివరకు అతన్ని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు హాజరుపరిచారు. సంజీవ్ జైన్‌పై 2017లో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసి నట్లు షాహదారా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సురేంద్రచౌదరి తెలిపారు. ఆయనపై షాహదారా పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు నాన్-బెయిలబుల్ వారెంట్లు, జాతీయ కమిషన్ జారీ చేసిన ఒక బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నాయి. వారెంట్ల నేపథ్యంలో ఆయన్ని పట్టుకునేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ రంగంలోకి దిగిన విషయం తెల్సిందే.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×