BigTV English

Shahid Latif: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ దారుణ హత్య

Shahid Latif: ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ దారుణ హత్య

షాహిద్ లతీఫ్‌.. ఇండియా మోస్ట్‌ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్ట్ లో ఒకడు. 1999 ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌ నుంచి మొదలు పెడితే.. పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడుల వరకూ.. అన్నింట్లో ఇతని హస్తం ఉంది. అలాంటి టెర్రరిస్ట్‌ ఇప్పుడు పాకిస్థాన్ గడ్డపైనే ఓ మసీదులో చనిపోయాడు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? దీని వెనకున్నది ఎవరు? అన్న వివరాలు ప్రస్తుతం మిస్టరీగానే ఉన్నాయి. కానీ బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు లతీఫ్ పై కాల్పులు జరుపగా.. అతను అక్కడికక్కడే మరణించాడు. పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో ఈ హత్య జరిగింది.


2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి జరిగింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది. ఈ దాడిలో భారత సైన్యానికి చెందిన ఏడుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి లతీఫ్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ విచారణలో తేలింది. పాకిస్థాన్‌లోని ఒక మసీదులో గుర్తు తెలియని దుండగులు అతన్ని కాల్చి చంపారు. అతను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సియాల్‌కోట్ నగరంలో హత్యకు గురయ్యాడు.

నిషేధిత ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌లో సభ్యుడైన 41 ఏళ్ల లతీఫ్‌.. 2016, జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌ దాడికి వ్యూహరచన చేశాడు. దానిని అమలు చేయడానికి సియాల్‌కోట్‌ నుంచి నలుగురు ఉగ్రవాదులను పంపించాడు. 1994 నవంబర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద లతీఫ్‌ను పోలీసులు భారత్‌లో అరెస్టు చేశారు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడిని పాకిస్థాన్‌కు డీపోర్ట్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లిన తరువాత జైషే మహమ్మద్‌లో చేరిన లతీఫ్‌ భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు. 1999లో జరిగిన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడు.


షాహిద్ లతీఫ్ ఉగ్రవాద ఆరోపణలపై 1994 నవంబర్‌లో అరెస్టయ్యాడు.అతనిపై విచారణ జరిపి జైలుకు పంపారు. షాహిద్ లతీఫ్ దాదాపు 11 ఏళ్ల పాటు భారతీయ జైలులో బంధిగా ఉన్నాడు. భారత్‌లో శిక్షాకాలం పూర్తయిన తర్వాత 2010లో పాకిస్థాన్‌కు పరాయ్యాడు. భారత్ నుంచి బహిష్కరణకు గురైన షాహిద్ లతీఫ్ తిరిగి పాకిస్థాన్‌లోని జిహాదీ ఫ్యాక్టరీకి వెళ్లి భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

Related News

Karur stampede updates: విజయ్ అరెస్టు తప్పదా? పెరుగుతోన్న మృతులు, విచారణకు ఏకసభ్య కమిషన్

Trump Tariff: ఇండియాకు మరో ఝలక్.. ఫార్మాపై ట్రంప్ పిడుగు.. 100% టారిఫ్..

UP CM Yogi: సీఎంని పాతిపెట్టేస్తాం.. ముస్లిం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

BSNL 4G Network: రేపటి నుంచే దేశంలో 4జీ సేవలు ప్రారంభం.. ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Big Stories

×