BigTV English

Israel Gaza Conflict : గాజా ఎప్పటికీ తిరిగి రాదు..ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కామెంట్

Israel Gaza Conflict : గాజా ఎప్పటికీ తిరిగి రాదు..ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కామెంట్

Israel Gaza Conflict : తమ దేశ పౌరులను చంపడానికి ప్రయత్నించే హమాస్ కు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ హెచ్చరికలు పంపారు. దేశంలో శిరచ్ఛేదం చేయడానికి ప్రయత్నించినా, మహిళలను చంపినా.. అలాంటి వారిపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం గాజా స్ట్రిప్‌తో ఇజ్రాయెల్ సరిహద్దులో ఫ్రంట్ లైన్ తనిఖీ సందర్భంగా యోవ్ గాలంట్ సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హమాస్ పై చేస్తున్న పోరాటంలో తీసుకోవాల్సిన చర్యలను, ఆంక్షలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం రీయిమ్ సైనిక స్థావరంలోని ఐడీఎఫ్ గాజా డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి యోవ్ గాలంట్ సందర్శించారు.


గతవారం హమాస్ మొదటి లక్ష్యంగా దాడులు చేసిన ప్రాంతాల్లో ఒకటైన కిబ్బట్జ్ బీరీ వద్ద ఉన్న షాల్దాగ్ ఫైటర్లు, పారా ట్రూపర్లు, సైనికులతో మంత్రి మాట్లాడారు. మరికొన్ని నెలలో తిరిగి బీరీకి వస్తామని, కిబ్బట్జ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గాజాలో తలెత్తిన పరిస్థితులు కిబ్బట్జ్ లో రాకుండా చూస్తామన్నారు.

హమాస్.. గాజాలో ఏ మార్పునైతే కోరుకున్నారో.. అందుకు భిన్నంగా వారంతా పశ్చాత్తాపపడుతారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పేర్కొన్నారు. హమాస్ గాజాలో కోరుకున్న మార్పుకంటే.. 180 డిగ్రీలు మారుతుందన్నారు. కానీ..గాజా దాడులకు ముందున్న పరిస్థితులు మళ్లీ ఉండబోవని అభిప్రాయపడిన మంత్రి.. హమాస్ ను ఐసిస్ ఆఫ్ గాజా గా వర్ణించారు.


గాజాలో ఇప్పటి వరకూ జరిగిన వైమానిక దాడులు ఇజ్రాయెల్ ప్రాథమిక ప్రతీకార చర్యగా ఉన్నాయన్నారు. 140 చదరపు మైళ్ల తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను జెట్ల ద్వారా సేఫ్ ప్రాంతాలకు చేర్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే దెబ్బతిన్న పెద్ద పెద్ద భవనాలను పూర్తిగా శిథిలం చేసి.. గాయపడిన పాలస్తీనియన్లను ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×