BigTV English

Assembly Sessions: సభ.. ఇక లాంఛనమేనా!

Assembly Sessions: సభ.. ఇక లాంఛనమేనా!

Assembly Sessions: ప్రజావాణిని వినిపించే వేదికే శాసన సభ. గతంలో విపక్షాలు ఆ శాసన సభ వేదికగా సర్కారు తప్పిదాలను ఎత్తిచూపుతూనే.. ప్రజల సమస్యలపై గళమెత్తేవి. అటు.. అధికార పక్షం కూడా తాము చేసిన, చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విపులంగా వివరించేది. అయితే.. ఇటీవలి కాలంలో ఆ సీన్ బొత్తిగా మారిపోయింది. జనవాణిని వినిపించాల్సిన శాసనసభ.. అరుపులు,కేకలు, దూషణలకు కేంద్రంగా మారింది. కొన్నిచోట్ల అయితే.. బల్లలు, మైకులు విరిచేయటమూ ఆనవాయితీ అయిపోయింది. అసలు సభను సమావేశపరచటమే తగ్గిపోయిన ఈ రోజుల్లో సభాసమయం కుదించుకుపోతోంది.


అసెంబ్లీ సిటింగ్‌ల సంఖ్య తగ్గిపోతుండటంపై ప్రజాస్వామ్యవాదులు కలవరపడుతున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో నాలుగు అసెంబ్లీ సమావేశాల తీరుతెన్నులను ఓ సారి పరిశీలిస్తే సంగతి బోధపడుతుంది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే అసెంబ్లీ సిట్టింగ్స్ గణనీయంగా తగ్గాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఓటర్లు 16వ అసెంబ్లీని ఎన్నుకోనుండగా మిజోరంలో 9వ అసెంబ్లీ, తెలంగాణలో 3వ అసెంబ్లీని ఎన్నుకోవాల్సి ఉంది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నరాష్ట్రాల్లో తెలంగాణ అసెంబ్లీయే కొత్తది. 2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014-19 మధ్య కాలంలో తొలి అసెంబ్లీ 127 రోజులు కొలువుదీరింది. ప్రస్తుత అసెంబ్లీకి వచ్చేసరికి 75 సిటింగ్‌లకే పరిమితమైంది.


ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2000లో మధ్యప్రదేశ్ నుంచి విడివడింది. అప్పటి నుంచి ఐదు సార్లు అసెంబ్లీని ఎన్నుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ (2019-24) అత్యల్ప సమయం కొలువుదీరింది. ప్రస్తుతం 116 సిటింగ్‌లే జరిగాయి. 2003-08 నాటి రెండో అసెంబ్లీ అత్యధికంగా 182 రోజులు కొలువు దీరింది.

మధ్యప్రదేశ్ ప్రస్తుత అసెంబ్లీ 79 సిటింగ్‌లు పూర్తయ్యాయి. 1956-57 తర్వాత ఇంత అత్యల్ప సమయం అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇది రెండోసారి. తొలి అసెంబ్లీ వ్యవధి చాలా తక్కువ. అందుకే ఆ అసెంబ్లీ కేవలం 16 రోజుల పాటే కొలువుదీరింది. 11వ అసెంబ్లీ (1998-2003) మాత్రం అత్యధికంగా 288 సిటింగ్‌లు జరిగాయి. ఇక ఆ తర్వాత సభా సమయం తగ్గుతూనే వచ్చింది.

రాజస్థాన్ కూడా అంతే. ప్రస్తుత సభ 147 రోజులు కొలువుదీరింది. 8వ అసెంబ్లీ (1985-90) తర్వాత ఇదే అత్యధిక సమయం అని చెప్పుకోవాలి. ఇక అతి తక్కువ రోజులు కొలువుదీరింది 9వ అసెంబ్లీ. 1990-92 నాటి ఆ అసెంబ్లీ సమావేశాలు 95 రోజులకే పరిమితమయ్యాయి. 1957-62 నాటి రెండో అసెంబ్లీ సమయంలో మాత్రం అత్యధికంగా 306 సిటింగ్‌లు జరిగాయి.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×