BigTV English

Woman Doctor: మరో ట్రైనీ డాక్టర్ పై దాడి.. ముంబయి హాస్పిటల్‌లో వైద్యురాలిపై పేషెంట్ దాడి

Woman Doctor: మరో ట్రైనీ డాక్టర్ పై దాడి.. ముంబయి హాస్పిటల్‌లో వైద్యురాలిపై పేషెంట్ దాడి

Assault on female doctor: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం ఘటన దేశాన్ని కుదిపేస్తున్నది. దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన బాటపట్టారు. ఒకవైపు మహిళా వైద్యులకు సేఫ్టీ గురించి ఆందోళనలు జరుగుతుండగా.. మరో వైపు వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని ఓ హాస్పిటల్‌లో వైద్యం అందిస్తున్న మహిళా డాక్టర్ పై పేషెంట్ దాడి చేశాడు. ఆయన వెంట వచ్చిన రిలేటివ్స్ కూడా డాక్టర్ పై దాడి చేసి పారిపోయారు. ఈ ఘటన ముంబయిలోని సియన్ హాస్పిటల్‌లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.


అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో హాస్పిటల్‌కు వచ్చాడు. అప్పటికే ఓ గొడవలో ఇన్వాల్వ్ అయినట్టుగా గాయాలున్నాయి. ఆయన వెంట మరికొందరు బంధువులు ఉన్నారు. ముఖంపై ఎక్కువ గాయాలు ఉండటంతో పేషెంట్‌ను ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్‌కు రిఫర్ చేశారు. ఆ డిపార్ట్‌మెంట్‌లో నైట్ షిఫ్ట్‌లో ఫీమేల్ డాక్టర్ ఉన్నారు. ముందుగానే ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత ఫీమేల్ డాక్టర్ పేషెంట్‌ను పరీక్షించింది.

ముఖంపై ఉంచిన కాటన్‌ను తొలగించి గాయాలు పరిశీలించే ప్రయత్నం చేసింది వైద్యురాలు. కాటన్ తొలగిస్తుండగా నొప్పితో పేషెంట్ అరిచాడు. ఆ తర్వాత డాక్టర్‌ను బూతులతో తిట్టాడు. ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఇద్దరి మధ్య మాటలను వారించి ట్రీట్‌‌మెంట్ జరిగేలా చూడాల్సిన రిలేటివ్స్ కూడా మరింత ఆజ్యం పోశారు. పేషెంట్ వైపు వకాల్తా పుచ్చుకుని డాక్టర్ పై ఇష్టమొచ్చినట్టు మాటలు వదిలారు. అసలు ఆమె సరిగ్గా ట్రీట్‌మెంట్ ఇవ్వడం లేదనీ ఆరోపించారు. ఈ మాటలు స్వల్ప సమయంలోనే దాడి రూపం తీసుకుంది. పేషెంట్ కోపంతో ఊగిపోతూ డాక్టర్ పై దాడి చేశాడు. పేషెంట్ రిలేటివ్స్ కూడా డాక్టర్‌ను కొట్టారు.


Also Read: Hussain Sagar: ఫుల్ ట్యాంక్ లిమిట్ దాటేసిన హుస్సేన్ సాగర్.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక ?

ఇది హాస్పిటల్‌లో పెద్ద వివాదంగా మారుతున్నదని గ్రహించి వెంటనే అక్కడి నుంచి టపా కట్టేశారు. పేషెంట్, అతని బంధువులు పారిపోయారు. ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో వైద్యురాలికి గాయాలయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆమె హాస్పిటల్ వెళ్లింది. ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

ఒక వైపు మహిళా వైద్యులకు, మహిళలకు సొసైటీలో రక్షణ లేకుండా పోతున్నదని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×