BigTV English

Hussain Sagar: ఫుల్ ట్యాంక్ లిమిట్ దాటేసిన హుస్సేన్ సాగర్.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక ?

Hussain Sagar: ఫుల్ ట్యాంక్ లిమిట్ దాటేసిన హుస్సేన్ సాగర్.. లోతట్టు ప్రాంతాలకు హెచ్చరిక ?

Hussain Sagar Water Level: భారీ వర్షాలు తెలంగాణ ప్రజలను, రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా భారీ వర్షం కురిసిన ప్రతీసారి హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ఎక్కడికక్కడే నాలాలు పొంగుతుండటంతో మురుగునీరంతా రోడ్లపై పారుతూ.. దుర్వాసన వెదజల్లుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు ఏళ్ల తరబడి ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపలేకపోతున్నారు.


రెండురోజులుగా నగరవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లిమిట్ ను దాటింది. శనివారం నాటికి సాగర్ నీటిమట్టం 513.53 మీటర్లు ఉంది. ఫుల్ ట్యాంక్ లిమిట్ 513.41 మీటర్లు. అంతకంతకూ నీటిమట్టం పెరుగుతుండటంతో అధికారులు 2 అడుగుల మేర 12 గేట్లను ఎత్తి నీటిని వదిలారు.

Also Read: భారీగా తగ్గిన చికెన్ ధరలు..కేజీ ఎంతంటే?


ఇటీవల కాలంలో తరచూ భారీ వర్షాలు కురుస్తుండటంతో.. సాగర్ కు వర్షపునీరు డ్రైనేజీల ద్వారా చేరి.. నీటిమట్టం పెరిగింది. శనివారం నాటిని సాగర్ ఇన్ ఫ్లో 2,075 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1538 క్యూసెక్కులుగా ఉంది. నిన్న నగరంలోని హిమాయత్ నగర్ లో అత్యధికంగా 5.8 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. సిద్ధిపేటలో అత్యధికంగా 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాలు కురిస్తే సాగర్ నీటిమట్టం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. భారీవర్షాల హెచ్చరికల నేపథ్యంలో సాగర్ కు సమీపంలోనున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related News

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

Big Stories

×