BigTV English

Vegetables For Eyesight: కంటి చూపును పెంచే కూరగాయలు ఇవే !

Vegetables For Eyesight: కంటి చూపును పెంచే కూరగాయలు ఇవే !

Vegetables For Eyesight : మన శరీర భాగాల్లో కళ్లు ముఖ్యమైనవి. కంటిని కాపాడుకోవడం అత్యంత అవసరం. పోషకాలతో నిండిన ఆహారపు అలవాట్ల వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారం కంటి చూపును మెరుగుపరుస్తుంది. సమతుల్య ఆహారం తినడం వల్ల రెటీనా సమస్యలు, రేచీకటి, కంటి శుక్లాల వంటి సమస్యల భారిన పడకుండా ఉంటాము. కొన్ని రకాల ఆహార పదార్థాలను తరుచుగా తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా సహజంగానే కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


క్యారట్ : క్యారెట్‌లో అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా కెరోటిన్, విటమిన్ ఏ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విటమిన్ ఏ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది రేచీకటి సమస్య నుంచి కూడా దూరం చేస్తుంది. దీనిలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

బచ్చలి కూర: కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బచ్చలికూర ఎంతో ఉపయోగపడుతుంది. బచ్చలి కూరలో లుటీన్, జియాక్సింతిన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెటీనా సాంద్రతను పెంచేందుకు ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా బచ్చలి కూరలో ఉండటం వల్ల ఇవి హానికరమైన కాంతి నుంచి కళ్లను రక్షించడంలో ఉపయోగపడతాయి. కంటి శుక్లం వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించడంతో చక్కగా పనిచేస్తుంది.


కాలే: విటమిన్ ఇ, సి, విటమిన్ కే, లతో పాటు లుటీన్, జింయాక్సింతిన్ లు కాలేలో పుష్కలంగా ఉంటాయి. రెటీనా ఆరోగ్యానికి ఇవి ఎంతగానో సహాయపడతాయి. ఇది కంటి శుక్లంతో పాటు వయస్సుతో
వచ్చే కంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చిలగడదుంప: వీటిలో బీటా కెరోటిన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్లను కాపాడేందుకు ఇవి ఎంతగానో సహాయపడతాయి. చిలకడదుంపలో మీ డైట్ ప్లాన్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా రేచీకటి సమస్యను కూడా ఇది దూరం చేస్తుంది.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×