E-Paper
Advertisement

షాకింగ్ ఘటన.. గస్తీ కాస్తున్న మహిళా పోలీసుపై యువకుడి దాడి.. వీడియో వైరల్!

షాకింగ్ ఘటన.. గస్తీ కాస్తున్న మహిళా పోలీసుపై యువకుడి దాడి.. వీడియో వైరల్!
Advertisement

Patna Shocker: బిహార్ రాజధాని పాట్నాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా పోలీసు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమెపై 22 ఏళ్ల యువకుడు భౌతిక దాడికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి.. కటకట్టాల్లోకి నెట్టారు.

అసలేం జరిగిందంటే?

సెప్టెంబర్ 30 సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘పోలీస్ దీదీ’ బృందం పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తోంది. ఆ సమయంలో ఒక ప్రాంతంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిచడంతో మహిళా పోలీసులు వారిని నిలదీశారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ అనే యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.

Advertisement

చేయి చేసుకున్న యువకుడు..

పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా ప్రదీప్ దౌర్జన్యానికి దిగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఓ మహిళా కానిస్టేబుల్ అతడిని చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఆవేశానికి లోనైన ఆ యువకుడు ఎదురుదాడి చేస్తూ ఆమెను కూడా లాగి పెట్టి కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియోలో పోలీసులు, యువకుల మధ్య నిమిషం పాటు వాగ్వాదం జరగడం.. అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారవ్వడం కనిపించింది.

Advertisement

Also Read: రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

సీసీటీవీ ఆధారంగా అరెస్ట్..

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పాట్నా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో సేకరించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రదీప్ కుమార్‌ను గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు యువకుల కోసం పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని అధికారులు తెలిపారు. కాగా పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల వద్ద విద్యార్థినుల భద్రతను పర్యవేక్షించడం కోసం ప్రభుత్వం ఈ ‘పోలీస్ దీదీ’ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.

Also Read: ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Tags

Related News

ర్యాపిడో పింక్ డ్రైవ్ వివాదం.. మహిళా రైడర్‌కి పురుష డ్రైవర్‌.. ‘నేను గే’ అంటూ విచిత్ర సమాధానం!

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

Big Stories

Advertisement
×