E-Paper
Advertisement

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!

రూ.10 వేలతో బిజినెస్.. ఇంటి నుంచే రూ. లక్షల సంపాదన.. రిచ్ అవ్వడం పక్కా!
Advertisement

Business Ideas Under Rs 10,000: సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. సొంత వ్యాపారం మొదలుపెట్టాలంటే లక్షల రూపాయిల పెట్టుబడి, పెద్ద దుకాణం, ఎక్కువ మంది సిబ్బంది అవసరం అని చాలామంది భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. కేవలం రూ. 5,000 నుండి రూ. 10,000 పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగలిగే లాభదాయక వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అందులో 7 అత్యుత్తమ బిజినెస్ ఐడియాలను ఇప్పుడు చూద్దాం.

1. ఇంటి వంటలతో ‘టిఫిన్ సర్వీస్’

మీకు వంట చేయడంపై ఆసక్తి, అభిరుచి ఉంటే ఈ ‘టిఫిన్ సర్వీస్’ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. దీనికోసం ప్రత్యేకంగా కిచెన్ లేదా షాపు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రాంతంలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులు, పీజీల్లో ఉండే వారిని లక్ష్యంగా చేసుకుని 5 నుండి 10 మందితో ఈ సేవలను ప్రారంభించవచ్చు. ఈ రూ. 10,000 బడ్జెట్‌తో ప్యాకింగ్ బాక్సులు, అవసరమైన నిత్యావసర సరుకులు, డెలివరీ ఖర్చులను సులభంగా కవర్ చేయవచ్చు. కస్టమర్ల సంఖ్య పెరిగే కొద్దీ మెనూను విస్తరిస్తూ మంచి ఆదాయం పొందవచ్చు.

2. ఊరగాయలు, అప్పడాల తయారీ

Advertisement

ఊరగాయలు, అప్పడాలు, పిండివంటలు, మసాలా పొడులు తయారు చేసి విక్రయించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చు. ప్రారంభంలో ఒకటి లేదా రెండు రకాల ఉత్పత్తులపై దృష్టి సారించి.. పొరుగువారు, బంధువులు, మిత్రుల నుండి ఆర్డర్లు తీసుకోవచ్చు. ఆ తర్వాత వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవచ్చు. అయితే ఆహార సంబంధిత వ్యాపారం కాబట్టి అవసరమైన FSSAI నిబంధనలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.

3. హోమ్ బేకరీ

మీకు కేక్‌లు, కుకీలు, ఇతర బేకరీ ఐటమ్స్ చేయడం వచ్చుంటే.. ఇంటి నుంచే హోమ్ బేకరీ ఆర్డర్లు తీసుకోవచ్చు. ప్రారంభంలో భారీ సెటప్ చేయాల్సిన పనిలేదు. ఇప్పటికే ఇంట్లో ఉన్న సామాగ్రినే ఉపయోగిస్తూ.. మీ వద్ద ఉన్న రూ. 10,000 బడ్జెట్‌ను ముడిసరుకు, ఆకర్షణీయమైన ప్యాకింగ్ మెటీరియల్ కోసం కేటాయించవచ్చు. పుట్టినరోజులు, వార్షికోత్సవాలు, చిన్న చిన్న వేడుకలకు ఆర్డర్లు పొందుతూ క్రమంగా మంచి బ్రాండ్‌గా మారవచ్చు.

4. రీసెల్లింగ్ వ్యాపారం

Advertisement

ఎలాంటి ఇన్వెంటరీ లేదా స్టాక్ నిర్వహించకుండా వ్యాపారం చేయాలనుకునే వారికి ‘రీసెల్లింగ్’ సరైన మార్గం. తయారీదారులు లేదా హోల్‌సేల్ సరఫరాదారుల నుండి దుస్తులు, జువెలరీ, హ్యాండ్‌బ్యాగ్స్, కాస్మొటిక్స్ వంటి ఉత్పత్తుల వివరాలు తీసుకుని నేరుగా కస్టమర్లకు విక్రయించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో స్టాక్ కొనకుండా, డిమాండ్‌ను బట్టి ఉత్పత్తులను అందించవచ్చు. వాట్సాప్ గ్రూపులు, ఇన్‌స్టాగ్రామ్ పేజీల ద్వారా కస్టమర్లకు చేరువ కావచ్చు.

5. మొబైల్ యాక్సెసరీస్ విక్రయం

ప్రస్తుత కాలంలో మొబైల్ కవర్లు, ఛార్జింగ్ కేబుల్స్, టెంపర్డ్ గ్లాస్, మొబైల్ స్టాండ్స్ వంటి చిన్న చిన్న వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి రూ. 10,000 పెట్టుబడితో ఎక్కువగా అమ్ముడయ్యే కొన్ని ట్రెండింగ్ యాక్సెసరీస్‌ను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో లేదా స్థానిక ప్రాంతంలో విక్రయించవచ్చు. అయితే, ఫోన్ మోడల్స్ మారుతున్న కొద్దీ పాత స్టాక్ వ్యర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరంభంలో తక్కువ పరిమాణంలో స్టాక్ తీసుకోవడం మంచిది.

6. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ సేవలు

మీకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై పట్టు ఉండి.. కాన్వా (Canva), వీడియో ఎడిటింగ్ టూల్స్ వాడటం వస్తే ఈ డిజిటల్ సేవలను వ్యాపారంగా మార్చుకోవచ్చు. స్థానిక షాపులు, కేఫ్‌లు, బ్యూటీ పార్లర్లు, జిమ్‌ల ఖాతాలను నిర్వహిస్తూ వారికి మార్కెటింగ్ సేవలు అందించవచ్చు. దీనికి మీ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే ప్రాథమిక పెట్టుబడి. కాబట్టి మీ రూ.10,000 బడ్జెట్ కూడా దాదాపు ఆదా అవుతుంది.

Also Read: ర్యాపిడో పింక్ డ్రైవ్ వివాదం.. మహిళా రైడర్‌కి పురుష డ్రైవర్‌.. ‘నేను గే’ అంటూ విచిత్ర సమాధానం!

7. గిఫ్ట్ ప్యాకింగ్, కస్టమైజ్డ్ గిఫ్ట్స్

పుట్టినరోజులు, వివాహాలు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో డిజైనర్ గిఫ్ట్ హ్యాంపర్లు, ఫోటో ఫ్రేమ్‌‌లు, హ్యాండ్‌మేడ్ కార్డులకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఆరంభంలో రిబ్బన్లు, బాక్సులు, ప్యాపింగ్ పేపర్లు, స్టిక్కర్లు, డెకరేటివ్ వస్తువులను మాత్రమే పరిమితంగా కొనుగోలు చేయాలి. కస్టమర్ నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత అవసరమైన వస్తువులను తెప్పించి గిఫ్ట్ ప్యాక్ సిద్ధం చేయవచ్చు. దీనివల్ల ఎక్కువ స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

Also Read: కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

Tags

Related News

అదనపు ఆదాయం కోసం ఈ-రిక్షా కొంటే.. తొలిరోజే రూ. 1.75 లక్షలు గోవిందా.. టెక్కీకి ఊహించని షాక్!

ఒక్కసారిగా రివర్స్ అయిన బంగారం ధర.. మార్కెట్లో ధరలు చూద్దాం.

టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ 5 విషయాలు తెలియకపోతే నష్టపోతారు!

దలాల్ స్ట్రీట్‌లో బేర్ విహారం.. గంట వ్యవధిలో రూ. 9.5 లక్షల కోట్ల ఆవిరి, ఎందుకిలా?

పెరిగిన బంగారం ధర.. మార్కెట్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయి?

‘నో యూపీఐ డే’ నిరసనపై వెనక్కి తగ్గిన ట్రేడర్స్.. మంత్రి నిర్మల భేటీలో ఏం జరిగింది?

పండగ సీజన్ వేళ సామాన్యుడికి షాక్.. గ్యాస్ సిలిండర్ల ధర పెంపు.. ఏకంగా రూ. 62.50 పెంపు

Big Stories

Advertisement
×