E-Paper
Advertisement

PM Kisan 22nd Installment: పీఎం కిసాన్ రూ.2 వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

PM Kisan 22nd Installment: పీఎం కిసాన్ రూ.2 వేలు పడేది అప్పుడే.. మీ పేరు ఇలా చెక్ చేసుకోండి
Advertisement

PM Kisan 22nd Installment: కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ 22వ విడత విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏటా రూ.6000 కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. దీనిని నాలుగు నెలకొకసారి రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

22వ విడత విడుదల ఎప్పుడు?

వ్యవసాయ అవసరాలకు, విత్తనాలు, ఎరువులు, మందులు, నీటిపారుదల, కూలీల ఖర్చులకు పీఎం కిసాన్ డబ్బులు ఉపయోగపడనున్నాయి. ఇప్పటివరకు, ఈ పథకం కింద కేంద్రం 21 వాయిదాలను విడుదల చేసింది. 21వ విడత నవంబర్ 2025లో రైతుల ఖాతాలకు జమ చేసింది. తాజాగా 22వ విడత డబ్బులు ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. గతంలో వాయిదాలు ఫిబ్రవరి చివరిలో విడుదలయ్యాయి. కాబట్టి ఈసారి కూడా నిధులు దాదాపు అదే సమయంలో వస్తాయని రైతులు భావిస్తున్నారు.

ఎవరికి డబ్బులు అందవు?

Advertisement

ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులు పీఎం కిసాన్ డబ్బులు పొందలేరు. ఫార్మర్ ఐడీ లేకపోవడం, బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయకపోవడం, తప్పు బ్యాంక్ ఖాతా సమాచారం లేదా భూమి రికార్డులను అప్డేట్ చేయకపోవడం.. ఇలా ఏమైనా తప్పిదాలు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు జమ కావు.

లబ్దిదారుడి లిస్ట్ మీ పేరు ఉందా?

1. పీఎం కిసాన్ లబ్దిదారుల లిస్ట్ లో మీ పేరును సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించండి.

Advertisement

2. నో యువర్ స్టేటస్ లేదా బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయండి.

3. మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

4. క్యాప్చా ఎటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయండి.

5. దీని తర్వాత, మీ మునుపటి వాయిదాలు, తదుపరి విడత స్థితి, ఈ-కేవీసీ సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Also Read : పీఎం కిసాన్ డబ్బులపై అప్డేట్.. జాబితాలో మీ పేరు ఇలా చెక్ చేసుకోండి

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×