BigTV English

Modi : ఆ దేశంలోని నేతలను చూసి నేర్చుకోండి.. విపక్షాలకు మోదీ కౌంటర్..

Modi : ఆ దేశంలోని నేతలను చూసి నేర్చుకోండి.. విపక్షాలకు మోదీ కౌంటర్..

PM Modi News Today(Latest breaking news in telugu): పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంపై తీవ్ర దుమారం రేగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ వేడుకను బహిష్కరించాలని విపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ గురువారం ఉదయం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో దేశంలో తాజా పరిణామాలపై స్పందించారు.


ఆస్ట్రేలియా పర్యటనలో ప్రవాస భారతీయులతో జరిగిన సభను ప్రధాని ప్రస్తావించారు. అందులో 20 వేలమంది పాల్గొన్నారని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వచ్చారని తెలిపారు. ఆ కార్యక్రమానికి వారంతా కలిసికట్టుగా హాజరయ్యారని చెప్పుకొచ్చారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన ప్రతిపక్ష పార్టీల తీరును ప్రధాని ఇలా పరోక్షంగా తప్పుపట్టారు.

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో భారత్‌ విదేశాలకు టీకాలు సరఫరా చేయడాన్ని అప్పట్లో విపక్ష పార్టీలు తప్పుపట్టాయని మోదీ గుర్తు చేశారు. సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలకు టీకాలు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారని తెలిపారు. ఇది బుద్ధుడు, గాంధీ తిరిగిన నేల అని పేర్కొన్నారు. మనం శత్రువుల గురించి కూడా ఆలోచిస్తామన్నారు.


ఈ నెల 28న మోదీ పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకావటంలేదని 19 ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ అంశంపై బీజేపీ సహా 14 ఎన్‌డీఏ పక్షాలు స్పందించాయి. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు విపక్షాలు తిలోదకాలిస్తున్నాయని ప్రకటన విడుదల చేశాయి. శిరోమణి అకాలీదళ్‌, వైసీపీ, బిజూ జనతాదళ్‌ కార్యక్రమానికి హాజరవుతామని ప్రకటించాయి. బీఆర్ఎస్ గురువారం నిర్ణయం తీసుకోనుంది.

Related News

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

High Alert In Bihar: రాష్ట్రంలో హైఅలర్ట్.. బీహార్‌లోకి జైషే ఉగ్రవాదుల చొరబాటు

US Drinks Ban: ట్రంప్ టారిఫ్.. అమెరికాకు షాకిచ్చిన వర్సిటీ, శీతల పానీయాలపై నిషేధం

Palghar Building Collapse: మహారాష్ట్రలోని విరార్‌లో కూలిన భవనం.. 15 మంది మృతి

Big Stories

×