Bihar Robbery: బిహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో దుండగులు పట్టపగలే భారీ దోపిడీకి తెగబడ్డారు. బెట్టియా ప్రాంతంలోని ‘సెన్కో జ్యువెలర్స్’ (Senco Jewellers) షోరూమ్‌లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లారు. దోపిడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కాగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
మెుత్తం మూడు బైకులపై ఎనిమిది మంది దుండగులు తుపాకులతో షోరూమ్ లోకి ప్రవేశించారు. లోపలికి వచ్చిన వెంటనే తమ వద్ద ఉన్న ఆయుధాలను చూపించి సిబ్బందిని, అక్కడున్న కస్టమర్లను భయభ్రాంతులకు గురిచేశారు. బయటి వారికి సమాచారం అందించకుండా ఉండేందుకు అందరి మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఆ తర్వాత అందరి చేతులు కట్టేసి ఒకే చోట కూర్చోబెట్టారు.
DAYLIGHT ROBBERY IN BIHAR! 🚨
Armed criminals looted crores worth of gold, silver jewellery and cash from a Senco Gold & Diamonds showroom in Bettiah on Wednesday afternoon.
Around 6–8 armed men reportedly stormed the showroom, held employees hostage and assaulted one staff member with a gun butt when he resisted.
After the massive robbery, DIG and SSP officials rushed to the spot.
A shocking daylight robbery raises serious questions about law and order in Bihar.
#Bihar #SencoGold #Robbery
— Indian Observer (@ag_Journalist) November 18, 2026
షోరూమ్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత దొంగలు తమ పనిపై ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన బంగారు, వజ్రాభరణాలను బ్యాగుల్లో నింపుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తుల తలలపై దుండగులు ఆయుధాలతో బలంగా కొట్టారు. అందినకాడికి ఆభరణాలను దోచుకున్న తర్వాత దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే వెళ్లేముందు వారు చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని మరింత విస్మయానికి గురిచేశాయి. ‘మేము మళ్లీ వస్తాం.. ఇదొక సినిమా’ అంటూ వారు సవాల్ విసిరి వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ వెల్లడించారు.
Also Read: Airtel జాక్‌పాట్ ప్లాన్.. రూ.598కే నెట్ ఫ్లిక్స్, అపరిమిత 5G.. జీ5, హాట్ స్టార్ సైతం ఉచితం!
భారీ చోరీపై సమాచారం అందుకున్న వెంటనే డీఐజీ హరికిశోర్ రాయ్, ఎస్పీ కుమార్ గౌతమ్, డీఎస్పీ అజిత్ కుమార్‌లతో పాటు పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు షోరూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యక్ష సాక్షులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. దుండగులు సుమారు రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. బెట్టియా చరిత్రలోనే ఇది అత్యంత భారీ దోపిడీ కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read: లిఫ్టులు, ఎస్కలేటర్లపై కొత్త రూల్స్.. ప్రభుత్వం కఠిన ఆంక్షలు.. రాష్ట్రంలో అందరూ పాటించాల్సిందే!