Pakistan Army LoC Firing|పహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై బుధవారం తెల్లవారు ఝామున దాడులు చేసింది. ఈ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల్లోని జమ్మూ ప్రాంతం పూంచ్ జిల్లా, కుప్వారా జిల్లాల లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విచ్చలవిడిగా కాల్పులు జరిపింది. ఈ భారీ కాల్పుల్లో ఒక మహిళ సహా ఎనిమిది మంది చనిపోయినట్లు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. దీని తగిన సమాధానం పాకిస్తాన్ ఆర్మీ తప్పక ఇస్తామని బిఎస్ఎఫ్ అధికారి తెలిపారు.
చనిపోయిన ఎనిమిది మంది పూంచ్ జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. వీరిలో ఇద్దరు యువకులు మొహమ్మద్ ఆదిల్, సలీం హుస్సేన్, ఒక మహిళ రూబీ కౌర్ ఉన్నారు. వీరితో పాటు కుప్వారా జిల్లా సలాబాబాద్ గ్రామంలో మరో 8 మంది తీవ్ర గాయలు పాలవడంతో ఆస్పత్రి తీసుకెళ్లగా అందరూ చికిత్స పొందుతూ మరణించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న మేన్‌ధార్ ప్రాంతంలో ఢాక్కి గ్రామంలో కనీసం 10 ఇళ్లను పాకిస్తాన్ ఆర్మీ ధ్వంసం చేసింది.
భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తొమ్మిది చోట్ల ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసిన వెంటనే పాకిస్తాన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉన్న ఇండియన్ ఆర్మీ బార్డర్ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. అంతకుముందు కశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రాంతమైన బైసారాన్ లో ఏప్రిల్ 22న పాక్ ఆర్మీ అండదండలున్న ఉగ్రవాదులు దాడులు చేసి 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. గత రెండు దశాబ్దాల్లో ఆ ప్రాంతంలో ఇతే అతి పెద్ద దాడి. ఆ తరువాత కూడా పాకిస్తాన్ ఆర్మీ పలుమార్లు సరిహద్దుల ఉల్లంఘన చేస్తూ కాల్పులు జరిపింది. వరుసగా 12 రోజుల పాటు ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.
Also Read: ఆపరేషన్ సింధూర్.. భారత్ అలర్ట్, ఎయిర్‌పోర్టులు మూసివేత
ఫిబ్రవరి 2021న భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ సంవత్సరం జనవరి నుంచి ఏప్రిల్ 2025 ప్రతమార్థం వరకు 15 సార్లు పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిగిన దాడులు ఈ సంవత్సరంలో పాక్ ఆర్మీ చేసిన భారీ దాడిగా బిఎస్ఎఫ్ అభివర్ణించింది. త్వరలోనే పాక్ ఆర్మీకి గట్టి సమాధానం ఇస్తామని తెలిపింది.